ఒంటి పూట బడులపై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..!!

ఏపీలో రేపు (18వ తేదీ) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణతో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగింపు రోజు వరకు ఇదే తరహాలో కొనసాగించాలని నిర్దేశించారు.

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు జరిగే ఏడు రోజుల పాటు 1 నుంచి 9 తరగతలు విద్యార్ధులకు మధ్నాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్ం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభఉత్వ ఆదేశాల ప్రకారం ఒంటి పూట బడులు నిర్వహించాలని తాజాగా అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం జగనన్న గోరుముద్ద అందచేస్తున్నారు. బడుల్లో భోజనం చేసిన తరువాతనే విద్యార్ధులను వారి ఇళ్లకు పంపిస్తారు. ఒంటిపూట బడుల సమయంలోనూ నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేసారు.

AP Govt issues latest guide lines of Half day in all Schools across the state

ఒంటి పూడ బడుల సమయంలో ఒక్కడా బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం పేర్కొంది. అన్ని పాఠశాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎండల నేపథ్యంలో విద్యార్దుల ఉపయోగం కోసం ప్రతీ పాఠశాలలో కొన్ని ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యుషన్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. మధ్నాహ్న భోజన సమయంలో స్థానికుల సమన్వయంతో మజ్జిగ అందించాలని సూచించింది. ఏప్రిల్ 24 ఈ విద్యా సంవత్సరంలో చివరి పని దినంగా పేర్కొన్నారు. అప్పటి వరకు ఇదే తరహాలో ఒంటి పూడ బడుల అమలుకు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+