సంక్రాంతి సెలవులు పొడిగింపు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కార్యాలయాలు.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు.. బస్సులు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, పండుగ వేళ ఈ నిర్ణయం మరింత జోష్ పెంచుతోంది.
సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. రెండు రాష్ట్రాల్లోనూ పండుగ ఘనంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వ విద్యా సంస్థలు.. కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. విద్యా సంస్థలకు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఏపీలో సెలవులు ఇచ్చారు. తిరిగి 19న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా కార్యాలయాలు.. బ్యాంకులకు సెలవులు ఖరారు చేసింది. కాగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16న కనుమ పండుగ రోజును నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం - 1881 కింద సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం జిఒఆర్‌టి నెంబరు 32ని విడుదల చేసింది.

మొదటగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితాలో జనవరి 16కు బ్యాంకు సెలవు లేదు. అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జనవరిలో సెలవులు పెరగనున్నాయి. కాగా.. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సెలవు ఉంది. ఇక ఆప్షనల్ హాలీడేస్‌లో హజ్రత్ అలీ జయంతి, 16వ తేదీన షబ్-ఎ-మెరాజ్ ఉన్నాయి. విద్యార్థులకు జనవరిలో మొత్తం 13 సెలవులు వచ్చాయి.
సంక్రాంతికి ఏకంగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఆదివారాలను కలిపితే మొత్తం 13 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంక్రాంతి సెలవులు వరుసగా అందరికీ వర్తించనున్నాయి. కాగా.. వచ్చే వారం మొత్తం సెలవు మూడ్ లోకి వెళ్లనుంది. అటు రైళ్లు.. బస్సుల స్పెషల్ సర్వీసులను మరింత పెంచే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications