విశాఖ,విజయవాడ లో కొత్తగా - కీలక నిర్ణయం, గేమ్ ఛేంజర్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. రెండు నగరాల్లో మెట్రో కోసం ఇప్పటికే డీపీఆర్ లు సిద్దం చేసిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఆర్దిక సాయం కోసం ప్రతిపాదనలు పంపింది. కాగా, ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టు కోసం భూ సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నగరాల్లో మెట్రో కోసం 199 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయం
విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రెండు నగరాలకు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. ఈ రెండు నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వీలుగా అవసరమైన భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు తదుప రి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మెట్రో తొలి విడత పనుల కోసం కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదించారు.

ప్రతిపాదనలు
విజయవాడ, విశాఖలో తొలి విడత మెట్రో కోసం రూ 11 వేల కోట్ల మేర అవసరం అవుతుందని అధికారులు అంచనాలు సిద్దం చేసారు. ఈ మేర ఆర్దికంగా తోడ్పాటు అందించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇదే సమయంలో భూ సేకరణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుం ది. ముందుగా భూ సేకరణ ద్వారా కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలకు సిద్దం అయితే, ముందుగా భూమి సిద్దం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. విశాఖలో మొదటి దశలో రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.
కేటాయింపులు
విశాఖ నగరంలో మెట్రో కోసం మూడు కారిడార్లు ప్రతిపాదించారు. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడా ర్ నిర్మిస్తారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు. అదే విధంగా విజయవాడ మెట్రో రెండు దశలుగా నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ క్రమంలో భూసమీకరణ కీలకంగా మారుతోంది. బడ్జెట్ లో మెట్రోకు కేటాయింపులు చేస్తారని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తాజా నిర్ణయం రెండు నగరాల్లోనూ గేమ్ ఛేంజర్ గా మారనుంది.












Click it and Unblock the Notifications