ఏపీలో నైట్‌క‌ర్ఫ్యూ తొల‌గింపు - మాస్కు తప్పనిసరి : ఆంక్షలు మాత్రం...ఇలా..!!

కరోనా నియంత్రణలోకి రావటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ లో కరోనా థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న సమయంలో ప్రభుత్వం కరోనా ఆంక్షలు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేసారు. అదే సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. థియేటర్లలో 50 శాతం సీటింగ్ అమలు... షాపింగ్ మాల్స్ లో సామాజిక దూరం...అదే విధంగా మాస్కు వినియోగించని వారికి జరిమానా నిర్ణయాలు అమలు చేసింది.

అదుపులోకి వచ్చిన కరోనా

అదుపులోకి వచ్చిన కరోనా


అయితే, ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి వచ్చింది. గత నెలలో దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా రోజు వారీ కేసులు రాగా.. ఇప్పడుు 40 వేల దిగువకు చేరాయి. దీంతో...కేసులు అత్యధికంగా నమోదు అయిన రాష్ట్రాలు సైతం ఇప్పటికే కరోనా ఆంక్షలను సడిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా థర్డ్ వేవ్ తొలిగిపోయినట్లుగా ప్రకటించింది. ఆంక్షలు తొలిగించటంతో పాటుగా .. ఐటీ తో పాటుగా అన్ని కార్యాలయాలు..సంస్థలు గతంలో మాదిరిగా యతాతధంగా నిర్వహించుకోవచ్చని సూచించింది. ఇక, ఏపీ సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కరోనా పైన సమీక్ష చేసారు.

సీఎం జగన్ సమీక్షలో నిర్ణయం

సీఎం జగన్ సమీక్షలో నిర్ణయం

రాష్ట్రంలో కరోనా కేసులు..చికిత్స పైన ఆరా తీసారు. వేల సంఖ్యలో నమోదైన కేసులు ఈ రోజున 434 మాత్రమే నమోదయ్యాయి. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, కరోనా అనేది పూర్తిగా తొలిగిపోయేది కాకపోవటంతో...జాగ్రత్తలు మాత్రం పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మాస్కు వినియోగం తప్పని సరి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్న ఫీవర్ సర్వేను సైతం కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ పైన కొంత కాలంగా కసరత్తు చేస్తున్న సీఎం..దీనిని వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ఇక, ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత ..ఆంక్షల కొనసాగింపు

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత ..ఆంక్షల కొనసాగింపు

ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 23,13,212కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,698 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,726 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 22,83,788 మంది రికవరీ అయ్యారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బౌతికదూరం పాటించాలని, కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+