ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై బడ్జెట్ లో కీలక ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేసారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లుగా పేర్కొనగా..ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు గా బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక, మహిళలు.. రైతుల కోసం భారీగా కేటాయింపులు చేసారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.
ఏపీ బడ్జెట్ లో సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పాఠశాల విద్య రూ.32,308 కోట్లు, వైద్య శాఖ రూ.19,306 కోట్లు, వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు, బీసీ సంక్షేమం రూ.23,650 కోట్లు, ఇంధన శాఖ రూ.13,934 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.22,941 కోట్లు, జలవనరులు రూ.18,223 కోట్లు గా కేటాయించారు. ఇదే సమయంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు భారీగా నిధులు పెంచారు. మహిళలు.. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తన బడ్జెట్ లో పయ్యావుల కేశవ్ స్పష్టం చేసారు. ఇందు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్ లో ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు కేటాయించారు. ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్లు కొనసాగిస్తూ.. అర్హులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.

మహిళలు.. రైతుల సంక్షేమం కోసం కేటాయింపులు
మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కు మంచి ఆదరణ కనిపిస్తోందిన మంత్రి పయ్యావుల వివరించారు. ఈ బడ్జెట్ లో స్త్రీశక్తి పథకం కోసం రూ.1,420 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా మహిళలకు అందిస్తున్న పథకాల కేటాయింపులను వివరించారు. వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు, తల్లికి వందనం - రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం - రూ.4,581 కోట్లు కేటాయింపులు చేసారు. మహిళలను ఆర్దికంగా తోడ్పాటు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చి దిద్దుతామని పయ్యావుల ప్రకటించారు. అదే విధంగా రైతుల కోసం కీలక నిర్ణయాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవ - రూ.6,600 కోట్లు,
ధరల స్థిరీకరణ నిధి - రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో - రూ.260కోట్లు, పంటల బీమా - రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు కేటాయింపులు చేసారు. ధాన్యం సేకరణ నిధులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కేశవ్ వివరించారు.












Click it and Unblock the Notifications