వరద బాధితులకు బిగ్ రిలీఫ్- బిల్లులు వాయిదా..!!

వదర ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అండగా నిలుస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో వదర ప్రభావిత ప్రాంతాల్లోని వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్లు గుర్తించారు.

బిల్లలు వాయిదా
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు క్రమేణా మెరుగవుతున్నాయి. ప్రభుత్వం వదర బాధితుల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యుతం బిల్లుల వసూలు వాయిదా వేసింది. అదే విధంగా ..వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్‌ చేసి ప్రజలను దోచుకోకుండా చూస్తామని చెప్పారు. వాహనాల రిపేర్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాల రిపేర్లు, గ్యాస్‌ స్టవ్‌ల రిపేర్లు... ఇలా ఏ రిపేర్‌కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.

AP Govt monitoring Relief measures in Flood effected areas Announces key decisions

సహాయక చర్యలు
ఆన్‌లైన్‌లో ఇటువంటి సేవలు అందించేవారితో కూడా మాట్లాడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఫైర్‌ ఇంజన్లు ఈ రోజు ఐదు వేల ఇళ్ళు శుభ్రం చేశాయని వెల్లడించారు. నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం వెయ్యి ఎండీయూ రేషన్ వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ప్రభుత్వం అందజేస్తోంది. నిన్న మంత్రి మనోహర్ ట్రయల్ రన్ నిర్వహించారు.

తగ్గిన వరద
వరదల్లో చిక్కుకున్న వారికి నిన్నటి వరకూ ఆహారం, నీళ్లు, పాలు ప్రభుత్వం అంద చేసింది. నేటి నుంచి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. 179 సచివాలయాల పరిధిలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. పాడైన వాటర్‌ పైపులైన్లకు రిపేర్లు చేస్తున్నారు. ట్యాంకులు, కాలువలు, వాగులకు పడిన గండ్లును పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద ముంపు రేపటికి పూర్తిగా తగ్గిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+