వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వారికి వైద్యం చేయొద్దు- వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు....

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ బాధితుల గుర్తింపు చివరి దిశకు చేరుకుంటుందని భావిస్తున్న తరుణంలో స్ధానిక వైద్యుల చికిత్సలు ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పలుచోట్ల నగరాలు పట్టణాల్లోనూ కరోనా లక్షణాలతో వస్తున్న రోగులను ఆర్ఎంపీ డాక్టర్లు పరీక్షిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు రావడంతో సీరియస్ అయింది. ఇకపై అలా కుదరని స్పష్టం చేసింది.

ఏపీలో కరోనా చికిత్సలు..
ఏపీలో కరోనా వైరస్ బారిన పడిన రోగులకు, అనుమానితులకు, బాధితులకు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలతో పాటు ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తోంది. ఆరంభ దశలో క్వారంటైన్ చేస్తూ, తీవ్ర లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ చికిత్సలు అందిస్తున్న డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు అందించే విషయంలో ఓవైపు రచ్చ సాగుతుండగానే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో వచ్చే వారికి ఆర్ఎంపీ డాక్టర్లు అందిస్తున్న వైద్యం ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోందన్న విమర్శలున్నాయి.

ap govt orders medical practioners not to give treatment to covid 19 suspects

ఇకపై అలా కుదరదన్న ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇకపై జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆర్ఎంపీలు కొవిడ్-19 సంబంధిత వైద్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాని ప్రభుత్వం సూచించింది. దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలని కోరింది. ఉత్తర్వుల్ని ఉల్లంఘించే ఆర్.ఎం.పిలపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby

English summary
andhra pradesh government orders medical practioners across the state that not to treat patients with covid 19 symptoms. medical and health department orders them to inform such cases to volunteers, health workers and govt doctors only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X