అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత పోస్ట్ లు. డిప్యూటీ ఇంజనీర్ సస్పెన్షన్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉద్యోగులకు పాకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎధుర్కొన్న పలువురు ఉద్యోగులు .. ప్రస్తుత వైసీపీ సర్కారు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... తాజాగా మరో వ్యవహారం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేస్తుండగా.. తాజాగా అదే శాఖలో ఇప్పుడు ఓ ఉద్యోగి సీఎం జగన్ కు వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్ట్ లు సర్క్యులేట్ చేస్తూ దొరికిపోయాడు.

చంద్రబాబు డిమాండ్ ను జగన్ వినలేదు... చివరికి కేజ్రివాల్ నెరవేర్చాడిలా...చంద్రబాబు డిమాండ్ ను జగన్ వినలేదు... చివరికి కేజ్రివాల్ నెరవేర్చాడిలా...

సీఎం జగన్ తో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్న పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎంవీ విద్యాసాగర్ అనే అధికారి ఏకంగా సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా సీఎం జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ వాట్సాప్ గ్రూప్స్ లో పోస్టులు పెడుతున్నాడు. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో కార్పోరేషన్ ఎండీతో పాటు సీఐడీ అధిపతిగా కూడా వ్యవహరిస్తున్న పీవీ సునీల్ కుమార్ విద్యాసాగర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు,

Ap govt Suspends Police Housing Corporation executive engineer for Criticising Jagan

Recommended Video

COVID 19 Infected to 300 In AP Through 40 Super Spreaders

ఇప్పటికే విద్యాసాగర్ ఫోన్ స్వాధీనం చేసుకున్న సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం.. అతను వాట్సాప్ పోస్ట్ లను ఎవరెవరికి పంపాడు. వారి ద్వారా ఇంకెవరికి షేర్ అయ్యాయన్న వివరాలు రాబట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దోషిగా తేలితే అతన్ని సర్వీసు నుంచి తప్పించే అవకాశం కూడా ఉంటుంది.

English summary
andhra pradesh govt on monday suspended a deputy executive engineer working in ap police housing corportation for his controversial remarks in social media against cm jagan. corporation chief pv sunil kumar issued show cause notices to him also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X