వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆ 11 ప్రాంతాల్లో భారీ మార్పులు.. సీఎం జగన్ మరో కీలక అడుగు.. వెరైటీగా విజయసాయితో ప్రకటన..

|
Google Oneindia TeluguNews

మెయిన్ ల్యాండ్ ను ఆనుకుని అతి పెద్ద తీరం కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మత్యపరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా కొత్తగా 11 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి సీఎం జగన్ గతంలో స్వయంగా వెల్లడించగా, హార్బర్ల సంఖ్యతోపాటు వ్యయాన్ని కూడా పెంచిన విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించడం గమనార్హం.

డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి అజ్ఞాతంలోకి.. కూపీ లాగుతోన్న సీబీఐ..డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి అజ్ఞాతంలోకి.. కూపీ లాగుతోన్న సీబీఐ..

రూ.3500కోట్లతో..

రూ.3500కోట్లతో..

ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సముద్రంలో చేపల వేటకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారని, ఆయన దృఢ సంకల్పం ఫలితంగానే రూ. 3500 కోట్ల వ్యయంతో ఆయా తీర ప్రాంతాల్లో కొత్తగా 11 ఫిషింగ్‌ హార్పర్లు, ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని విజయసాయి తెలిపారు.

భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..

ఆ ప్రాంతాల్లో భారీ మార్పులు..

ఆ ప్రాంతాల్లో భారీ మార్పులు..


గత సీఎం చంద్రబాబు.. మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభించారని, సముద్రంలో చేపల వేటకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పన కూడా ఆయన పట్టించుకోలేదని వైసీపీ ఎంపీ గుర్తుచేశారు. దాని ఫలితంగా ఏపీ నుంచి 25వేల మందికిపైగా మత్స్యకారులు జీవనోపాధి కోసం ప్రతి ఏటా వందల మైళ్ళ దూరంలో ఉన్న గుజరాత్ తీరానికి వలసవలస పోయే పరిస్థితి నెలకొందని, అటు నుంచి పొరపాటున పాకిస్తాన్ జలాల్లో ప్రవేశిస్తే వారి కడగండ్లకు అంతేఉండదన్నారు. జగన్ సర్కారు తాజా నిర్ణయంతో మత్యకారులు ఎక్కువగా నివసించే 11 ప్రాంతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని ఎంపీ చెప్పారు.

అవి ఎక్కడంటే..

అవి ఎక్కడంటే..

ఏపీ సర్కారు కొత్తగా నెలకొల్పనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్), శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం, విశాఖపట్నం జిల్లా పూడిమడక(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్), తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్), కృష్ణాజిల్లా మచిలీపట్నం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్), గుంటూరుజిల్లా నిజాంపట్నం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్), ప్రకాశం జిల్లా కొత్తపట్నం(మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌), నెల్లూరు జిల్లా జువ్వలదిన్న(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌) తదితర ప్రాంతాల్లో మొత్తం రూ.3500 కోట్లతో నిర్మాణాలు, వసలుత ఏర్పాట్లు చేపట్టనున్నారు.

Recommended Video

AP CM Jagan On Nadu Nedu Education Review Meeting In Tadepalli
రెండోసారీ నెలకు రూ.10వేలు..

రెండోసారీ నెలకు రూ.10వేలు..

ప్రతి వేసవిలో దాదాపు రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఉపాధి లేక మత్స్యకారుల కుటుంబాలు అర్ధాకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో చేపల వేట విరామం కాలలో ప్రతి మత్స్యకారుని కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి వారి పట్ల సీఎం జగన్ తన పెద్ద మనసును చాటుకున్నారని విజయసాయి అన్నారు. మత్స్యకార భరోసా పథకం కింద గత నెలలో దాదాపు లక్షా 9 వేల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారని, వైసీపీ అధికారం చేపట్టిన ఏడాదిలో మత్యకారులకు డబ్బులు అందించడం ఇది రెండోసారని ఎంపీ తెలిపారు.

English summary
andhra pradesh govt to construct 11 fishing harbours with an investment of rs.3500 crore, ysrcp mp vijaya sai reddy announced on sunday. he slams chandrababu for cheating fishermen community
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X