ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్-ఈసారి పంపిణీ ఇలా..!

ఏపీలో నెలలవారీ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై (pensions) ఈసారి ప్రభుత్వం (ap govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఫిబ్రవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి 1 న ఇచ్చే పెన్షన్లను ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 31నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని జనవరి 30నే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈసారి కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. అయితే ఆ రోజు ఆదివారం వచ్చింది. అయినా బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం పెన్షన్ల పంపిణీ పని చేయించాల్సి ఉంటుంది. అందుకే ఒక్క రోజు ముందు అంటే జనవరి 31నే పెన్షన్లను లబ్దిదారులకు అందించాలని నిర్ణయించడంతో పాటు అధికారులకు ఆదేశాలు పంపుతోంది.

AP Govt to Distribute February Pensions Early on January 31 due to sunday reason

రాష్ట్రంలో ఇప్పటికే పలుసార్లు ఇలా రెగ్యులర్ గా ఇచ్చే ఒకటో తేదీ కంటే ముందే వివిధ కారణాలతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఇలా చేయాల్సి వస్తోంది. దీంతో లబ్దిదారుల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. సాధారణంగా కార్పోరేట్ సంస్థలు ఇలా నెల ఒకటో తేదీ కంటే ముందే ఉద్యోగులకు జీతాలు జమ చేస్తుంటాయి. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం సకాలంలో ఇస్తే గొప్ప అనే పరిస్ధితులు ఉంటాయి. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలను సైతం ముందుకు జరిపి ఇవ్వడంపై వాటిని అందుకుంటున్న కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+