ఏప్రిల్ 15 నుంచి ఏపీలో రెండోసారి ఉచిత రేషన్ - రెడ్ జోన్లలో ఇంటి వద్దకే సరుకులు..
ఏపీలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓసారి రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి వాలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దకే కూపన్లు పంపడంతో పాటు దుకాణాల వద్ద ప్రత్యేక ప్రణాళిక అమలు చేయబోతోంది. రెడ్ జోన్లలో మాత్రం ఇంటి వద్దకే సరుకులు రానున్నాయి.
ఏపీలో మరోసారి ఉచిత రేషన్..
ఏపీలో ఈ నెలలో రెండోసారి ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను మార్చి చివరి వారంలోనే పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం.. 15 నుంచి రెండో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కూపన్లు కూడా విడుదల చేసింది.

రెడ్ జోన్లలో మాత్రం ఇంటివద్దకే..
ఉచిత సరుకుల పంపిణీకి ఇప్పటికే కూపన్లు రావడంతో వాటిని గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ది దారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. వీటిని తీసుకుని ఈ నెల 15 నుంచి రెండోసారి ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం లబ్ధిదారులు వచ్చేందుకు వీలు కల్పిస్తారు. లబ్ది దారులను ఈసారి కూడా వేలి ముద్రల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రేషన్ షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటి ప్రకారం రద్దీని నివారిస్తారు. అలాగే రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications