ఏపీలో గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ - మే 11 నుంచి ఆన్ లైన్ కోచింగ్ ... దరఖాస్తు విధానమిలా..
ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార్ధులకు ఆన్ లైన్లో తరగతులు నిర్వహించేందుకు యూనివర్శిటీలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేశాయి.

గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..
ఏపీలో గేట్ పరీక్ష రాసే అభ్యర్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 28న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ యూనివర్శిటీల వీసీలకు సూచన చేశారు. దీంతో అనంతపురం, కాకినాడ జేఎన్టీయూలతో పాటు కడప యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులు... ఉన్నత విద్యామండలితో కలిసి ఆన్ లైన్ కోచింగ్ క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎవరెవరికి అంటే...
ఏపీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నోలో మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్ధులకు ఈ ఆన్ లైన్ కోచింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. రోజుకు ప్రతీ సెషన్ లో రెండు సబ్జెక్టుల చొప్పున, ఆన్ లైన్ ద్వారా బోధిస్తారు. ఇద్దరు వేర్వేరు అధ్యాపకులు ఆన్ లైన్ హాజరును పరిశీలిస్తారు.

దరఖాస్తు విధానం ఇలా...
ఆన్ లైన్లో దరఖాస్తు కోసం విద్యార్ధులతో పాటు అధ్యాపకుల కోసం అధికారులు ప్రత్యేక పోర్టల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్ లైన్లో అధ్యాపకుల నమోదు కోసం www.jntua.ac.in/gate-online-classes/list-of-faculty
సైట్లు వాడుకోవాలి. అలాగే
విద్యార్థులు ఆన్‌లైన్ గేట్ కోచింగ్ తరగతుల కోసం www.jntua.ac.in/gate-online-classes/registration
సైట్లలో నమోదు చేసుకోవాలి. మరోవైపు తరగతుల షెడ్యూల్ కో-ఆర్డినేటర్, సంబంధిత అంశాల కోసం విద్యార్థులు ఈ -మెయిల్ ద్వారా సంప్రదించేందుకు [email protected]
పేరుతో ఓ ఐడీని అందుబాటులో ఉంచారు.

ముఖ్యమైన తేదీలివే...
మే నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ గేట్ ఆన్ లైన్ కోచింగ్ కోసం విద్యార్ధులు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మే 11వ తేదీ నుంచి ఆన్ లైన్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్ధుల సౌలభ్యం కోసం కోఆర్డినేటర్ల పేర్లు, మెయిల్ ఐడీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అనంతపూర్ జేఎన్టీయూ అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ [email protected] ఈ మెయిల్ లోనూ 98495-09167
2 మొబైల్ నంబర్లోనూ అందుబాటులో ఉంచారు. అలాగే కాకినాడ జేఎన్టీయూ నుంచి డైరెక్టర్ డాక్టర్ వి. శ్రీనివాసులు [email protected]
ఈ మెయిల్ ఐడీలోనూ 97012-78555 మొబైల్ నంబరులోనూ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications