విశాఖ కేంద్రంగా గేర్ మార్చిన కూటమి ప్రభుత్వం..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఒకే చోట పాలన..అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్ములాతో కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం విశాఖ రాజధాని అనే నిర్ణయానికి ఎన్నికల్లో మద్దతు లభించలేదు. ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్మాణాలు ప్రారంభానికి అడుగులు వేస్తున్న ప్రభుత్వం..విశాఖ కేంద్రంగా తమ విధానం స్పష్టం చేయటానికి సిద్దమైంది. మంత్రివర్గ సమావేశంలో విశాఖను ఆర్దిక రాజధానిగా ఆమోద ముద్ర వేస్తూ.. మరో 22 పాలసీల ప్రకటనకు సిద్దం అవుతోంది.

ఆర్దిక రాజధానిగా విశాఖ
ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రం కీలక ప్రకటనకు సిద్దమవుతోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో విశాఖను ఆర్దిక రాజధానిగా ప్రకటించేలా నిర్ణయం తీసుకోనుంది. కూటమి నేతలు చాలా రోజులుగా విశాఖను ఆర్దిక రాజధానిగా కొనసాగిస్తామని చెబుతూ వచ్చారు. అమరావతి పరిపాలనా రాజధానిగా ..కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలకు కసరత్తు మొదలైంది. ఇదే సమయంలో విశాఖను ఆర్దిక రాజధానిగా అధికారికంగా ఖరారు చేయాలని నిర్ణయించింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసేందుకు కసరత్తు చేస్తోంది.

AP Govt to implement 22 new policies as Administrative reforms

పాలనా సంస్కరణలు
అదే సమయంలో పాలనా సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే నూతన ఇసుక పాలసీ, మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో 22 కొత్త పాలసీలను తీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టింది. ఇంధన రంగానికి సంబంధించిన విధాన రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై చంద్రబాబు ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. పర్యాటక, పారిశ్రామిక, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను ఖరారు చేయనుంది. ఆర్దిక సమస్యలు ఉండటంతో..ముందుగా ఆర్దికేత అంశాల పరిష్కారం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీల పైన సీఎస్ అధికారులకు సూచనలు చేసారు.

పాలసీలపై కసరత్తు
ప్రభుత్వం పాలనా పరంగా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముందుగా ఇంధన రంగం, ఉన్నత విద్య, బ్లూ ఓషన్ ఎకానమీ, మారి టైమ్, టెక్స్ టైల్, 500 కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామిక పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, రహదారులు, పర్యాటకం, యువత, వాటర్ పాలసీ తో పాటుగా పలు ఇతర రంగాలకు సంబంధించిన పాలసీలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో వీటి పైన నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+