అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ap govt to open sub registar offices from tomorrow with precautions

Recommended Video

Sports Knowledge In India Is Low, People Just Know About Cricket: Kiren Rijiju

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.

English summary
after liquor shops, andhra pradesh govt on monday decided to re open sub registrar offices across the state utside containment zones. govt has issued guidelines to re open sub registrar offices in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X