టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..!

ఏపీలో టిడ్కో ఇళ్లపై (TIDCO Houses) కూటమి సర్కార్ (ap govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉగాదికి లబ్దిదారులకు అందించాలని నిర్ణయించిన సర్కార్.. అదే సమయంలో గత ప్రభుత్వంలో డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసిన వారికి ఇళ్లు రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. వారికి అప్పట్లో చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఈ డబ్బుల రిఫండ్ చేపట్టనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం భారీ సంఖ్యలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అయినా వారికి ఫ్లాట్ కేటాయింపులు జరగలేదు. ఇలాంటి వారికి అప్పట్లో వాళ్లు చెల్లించిన దరఖాస్తు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం ఇలాంటి 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

AP Govt to Refund TIDCO House Applicants Denied Allotment

మరోవైపు రాష్ట్రంలోని 123 పట్టణ స్ధానిక సంస్థల్లో ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరగా కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకుని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్‌తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్, మన మిత్రతో వాటిని అనుసంధానించాలన్నారు. అలాగే ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా నీటి నాణ్యత పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైపులైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+