వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ 108 సేవల్లో ఇబ్బందులు-పనిచేయని జీపీఎస్-నో బఫర్ స్టాక్-సర్కార్ సీరియస్

|
Google Oneindia TeluguNews

ఏపీలో 108 సర్వీసుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు సీరియస్ అయ్యారు.108 సర్వీస్ ప్రొవైడర్,టెక్నికల్ విభాగాల బాధ్యులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 104, 108 సేవలు అందుతున్న తీరుపై ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు.

గతంలో అందిన విధంగా ఇప్పుడెందుకు 108 సేవలందడంలేదని అధికారుల్ని కృష్ణబాబు ప్రశ్నించారు. 108 సేవలపై కృష్ణ బాబుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఐటీ విభాగం సమర్ధవంతంగా పనిచేయగా ఇప్పటి ఐటీ విభాగం ఎందుకు కుంటుపడిందని ప్రశ్నించారు. సమర్ధవంతంగా పనిచేసే ఐటి పార్టనర్ ను ఏర్పాటు చేసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోను కృష్ణబాబు ఆదేశించారు. పనితీరును మెరుగు పర్చుకునేందుకు ఏంచర్యలు తీసుకున్నారని 'అక్షర' కంపెనీ ప్రతినిధుల్ని సైతం ఆయన ప్రశ్నించారు.

108 పనితీరును వివరించిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అడిషన్ సీఈవో మధుసూదన్ రెడ్డి కృష్ణబాబుకు వివరించారు. 108 వాహనాల్ని రిపేర్ చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని కృష్ణబాబు ప్రశ్నించారు.టెండర్ అగ్రిమెంట్ ప్రకారంసర్వీస్ ఇవ్వాలి కదా అన్నారు. 108 వాహనాలకు జిపిఎస్ లేకపోవడంపై సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ap health secretary serious on lapses in 108 services-orders to rectify in 2 weeks

748 వాహనాలకు గాను 164 వాహనాలకు ట్రాకింగ్ లేకపోవడంతో సీరియస్ అయ్యారు.వాహనాల బఫర్ స్టాక్ లేకపోవడంవల్లే 108 సేవలు సరిగా అందడంలేదని తెలుసుకుని..ప్రతి జిల్లాలోనూ వాహనాలు బఫర్ స్టాకు పెట్టుకోవాలని ఆదేశించారు. పనిచేయని వాహనాల విషయంలో ఎందుకు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అడిగారు.

748 వాహనాల్లో 164 వాహనాలకు ట్రాకింగ్ లేకపోతే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ లేకపోడం దారుణమన్నారు. పనిచేయని, పాత వాహనాల విషయంలో నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణ ఏదీ అని ప్రశ్నించారు. 104 వాహనాల జిపిఎస్ ఎలా పనిచేస్తోందని ఆరా తీశారు. ట్రాకింగ్ సరిగా లేకపోవడంపట్ల 104 టెక్నికల్ హెడ్ పై సీరియస్ అయ్యారు.

వాహనాల జిపిఎస్, జియో ఫేసింగ్ విధానాన్ని మెరుగుపర్చుకోవాలన్నారు.చేతకాకపోతే రీటెండర్ కు వెళ్లాలని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇవోకు ఆదేశాలు ఇచ్చారు. జీపీఎస్ లేకపోతే ఏ వాహనం ఏ గ్రామానికి ఎప్పుడెళ్తోందో ఎలా తెలుస్తుందన్నారు. రెండు వారాల్లో మెరుగుపర్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

English summary
ap govt issued orders to rectify issues in 108 services in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X