వాలంటీర్ల అధికారాలు- చట్టబద్దత పై హైకోర్టు ప్రశ్నలు : కీలక ఆదేశం .!?

వాలంటీర్ల అధికారాలు..చట్టబద్దతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర పైన హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ను హైకోర్టు ఆదేశించింది. లబ్దిదారులను గుర్తించే అధికారం వారికి ఎక్కడదని హైకోర్టు ప్రశ్నించింది. వాలంటీర్లకు సర్వీసు రూల్స లేవు కదా అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం వారికి జవాబుదారీ తన ఏముటుందని నిలదీసింది. లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న ఆరు అంచెల విధానం, అందులో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించింది.

వైఎస్సార్ చేయూత పథకం కింద గతంలో లబ్ది పొందత తను రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలిగించారంటూ పల్నాడు జిల్లా కు చెందిన 27 మంది హైకోర్టును ఆశ్రయించారు. గ్రామస్థాయి లబ్ది దారులను గతంలో పంచాయితీ కార్యదర్శి గుర్తించేవారని..్రపస్తుతం వాలంటీర్లు రాజకీయ కారణాలతో అనర్హులను చేస్తున్నారని పిటీషన్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీని పైన న్యాయమూర్తి బట్టు దేవానంద్ స్పందిస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల గుర్తింపు, అర్హను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడదని సూటిగా ప్రశ్నించారు. లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాలంటీర్ల ను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. వాలంటీర్లకు సర్వీసు నిబంధనల్లేవని..ఆ వ్యవస్థకు ఉన్న చట్టబద్దత ఏంటని ప్రశ్నించారు.

AP High Court Directed Serp CEO to Attned before the Court on role of volunteers in Govt welfare Schemes

లబ్దిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్ర లేదని గ్రామ,వార్డు వాలంటీర్లు..సచివాలయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసారు. సెర్ప్ సీఈవో ఇందుకు భిన్నంగా కౌంటర్ వేశారు. లబ్దిదారులను గుర్తించేందుకు వాలంటీర్లను వినియోగిస్తున్నామని..అందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నామని అందులో పేర్కొన్నారు. దీంతో..సెర్ప్ సీఈవో లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న ఆరు అంచెల విధానం, అందులో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆదేశాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+