ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమంత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు ప్రముఖ న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఈ కీలక బదిలీ ప్రక్రియ పూర్తయింది.
కొత్తగా ఏపీకి రానున్న ముగ్గురు జడ్జిలు వీరే
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్: గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.
జస్టిస్ డూండి రమేష్: అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.
జస్టిస్ సుభేందు సమంత: కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు.

ముగ్గురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలోనే కొలీజియం సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఈ ముగ్గురు జడ్జిలు త్వరలోనే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థ బలోపేతానికి, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి దోహదపడతాయని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కీలక పరిణామం న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications