రిటైర్డ్ ఐఏఎస్‌కు ఏపీ హైకోర్టు షాక్- ధిక్కారం కేసులో ఉదయలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా చేసిన తప్పిదం ఒకటి ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి మెడకు చుట్టుకుంది. కోర్టు ధిక్కారం కేసులో ఆమెకు ఇవాళ ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వీసులు ఉండగా పట్టించుకోకపోవడంతో ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉదయలక్ష్మి గతంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో, ఓ వ్యాయామ ఉపాధ్యాయుడి అంశంలో కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేశారంటూ హైకోర్టు తాజాగా వారెంట్ జారీ చేసింది. రాజమండ్రికి చెందిన పీఈటీ రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వ్యాయామ ఉపాధ్యాయుడు రత్నకుమార్ కు న్యాయం చేయాలని ఆదేశించింది.

అయితే, హైకోర్టు ఆదేశాలను ఉదయలక్ష్మి అమలు చేయలేదు. దీంతో తన ఆదేశాలను ఉదయలక్ష్మి పట్టించుకోకపోవడాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఉదయ లక్ష్మి తీరును కోర్టు ధిక్కరణగా పేర్కొంటున్నట్టు హైకోర్టు తాజా విచారణలో వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణలో ఉదయలక్ష్మిని తమ ఎదుట హాజరుపర్చాలని గుంటూరు ఎస్పీని ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసిన ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications