వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు వార్తలు రాస్తే జైలుకే... మీడియా జీవోపై తేల్చేసిన హైకోర్టు- జగన్ సర్కార్ కు భారీ ఊరట...

|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బల తర్వాత జగన్ సర్కారుకు భారీ ఊరట లభించింది. అదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధార, వాస్తవదూరమైన, తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్ధల విషయంలో కావడంతో ఇప్పుడు సర్కారు ఆనందానికి అవధుల్లేవు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఇప్పుడు ప్రభుత్వంపై వార్తలు రాసే విషయంలో మీడియా సంస్ధలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్దితి.

నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంలో జగన్ సర్కార్ పిటిషన్..నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంలో జగన్ సర్కార్ పిటిషన్..

 జగన్ కు భారీ ఊరట....

జగన్ కు భారీ ఊరట....

ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను కకావికలం చేసి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కారు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మీడియా సంస్ధలే. చాలా సందర్భాల్లో విపక్షాల కంటే ఎక్కువగా, మరికొన్ని సమయాల్లో విపక్షాలకు ఆయుధాలను అందిస్తూ సాగిపోతున్న మీడియా కథనాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వ విధానాలపై సరైన సమాచారం లేకుండా, నిరాధారంగా, వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు మీడియా సంస్ధలకు నోటీసులు ఇవ్వడం.. వాటికీ స్పందించకపోతే అప్పుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేలా ప్రభుత్వం జీవో నంబర్ 2430ను తీసుకొచ్చింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తూ దాన్ని తోసిపుచ్చింది.

 క్రిమినల్ చర్యలు కావు....

క్రిమినల్ చర్యలు కావు....

ప్రభుత్వంపై నిరాధారంగా, వాస్తవదూరంగా, ప్రభుత్వంలోని వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా రాసిన వార్తలపై ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు వివరణలు విడుదల చేస్తారని, వాటిని తిరిగి ప్రచురించడం ద్వారా వాస్తవాన్ని ప్రజలు గ్రహించేలా చేయాలని ప్రభుత్వం కోరింది. అప్పటికీ వివరణలు ప్రచురించకపోతే కేసుల నమోదుకు జీవో నంబర్ 2430 చట్ట ప్రకారంగా అనుమతి ఇస్తుందని పేర్కొంది. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ చర్య కేవలం క్రిమినల్ చర్యకు ఉద్దేశించినది కాదని పేర్కొన్న వివరణను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుసుంది. దీని వల్ల పత్రికాస్వేచ్ఛకు భంగం కలగదనీ, సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడంగానీ, ప్రచురణ, పంపిణీ స్వేచ్ఛలను అరికట్టడం గానీ జీవో ఉద్దేశం కాదని ప్రభుత్వం ఇచ్చిన వివరణను కోర్టు పరిగణలోకి తీసుకుంది.

Recommended Video

AP CM Jagan To Hold Cabinet Meetings Here After In Vizag
 చట్ట పరిధిలోనే ప్రచురణలు, ప్రసారాలు...

చట్ట పరిధిలోనే ప్రచురణలు, ప్రసారాలు...

విలువలతో కూడిన బాధ్యాతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ ఈ జీవో ప్రధాన ఉద్దేశమన్న ప్రభుత్వ సమాధానాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై ప్రస్తుత తరుణంలో జోక్యం అవసరం లేదని హైకోర్టు భావించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నిబంధల మేరకే వార్తా కథనాలు ప్రచురించాలని కేసు విచారణ సందర్బంగా హైకోర్టు భావించింది. కాబట్టి జీవో నంబర్ 2430 ప్రకారం వార్తా కథనాలు, ప్రసారాలపై ప్రభుత్వం చేపట్టే ఎటువంటి చర్యలైనా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధికి లోబడి చట్టప్రకారం తగు విచారణ జరిపేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు హైకోర్టు తీర్పులో పేర్కొంది.

English summary
after serial of setbacks, finally jagan government in andhra pradesh get big relief from high court in media houses cases over false, fake and defamatory news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X