ఏపీలో ఇద్దరు ఏఐఎస్ లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా-క్షమాపణతో సవరణ..
ఏపీలో విద్యాశాఖకు సంబంధించిన ఓ సర్వీసు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులపై ఇవాళ న్యాయస్ధానం కన్నెర్ర చేసింది. వీరిద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. నెల రోజుల జైలుశిక్షతో పాటు తలో 2 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అయితే వారిద్దరూ క్షమాపణలు చెప్పడంతో శిక్షలో సవరణలు చేసింది.
విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ ఓ సర్వీసు ఫైల్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలుచేయలేదు. దీంతో వీరిద్దరిపై హైకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం వారిని కోర్టు ధిక్కారం వ్యవహారంలో అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు నెల రోజుల పాటు జైలుశిక్ష విధించడంతో పాటు తలో రెండు వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో వారు దారికొచ్చారు.

ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు బుడితి రాజశేఖర్, రామకృష్ణ విషయంలో హైకోర్టు ఆదేశాలు వెలువడగానే
ఆ ఇద్దరూ న్యాయస్దానాన్ని క్షమాపణ కోరారు. హైకోర్టుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో అధికారుల అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు తన ఆదేశాల్లో సవరణలు చేసింది. నెల రోజుల చొప్పున వీరిద్దరికీ విధించిన జైలు శిక్ష రద్దు చేసింది. అంతే కాదు 2 వేల చొప్పున విధించిన జరిమానాను వెయ్యికి తగ్గించింది. దీంతో పాటు ఇవాళ
హైకోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టులోనే నిలుచోని ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications