• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాయర్లకు పోలీసుల బెదిరింపులా ? ఇక కోర్టులు మూసుకోవాల్సిందే- ఏపీ హైకోర్టు

|

ఏపీలో పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తీవ్ర వివాదాస్పదమవుతున్న హెబియస్‌ కార్పస్ పిటిషన్ల విషయంలో పోలీసుల తీరుపై పలుమార్లు హైకోర్టు సీరియస్‌ అయింది. ఇలాంటి ఓ కేసును సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరో కేసు విషయంలో పోలీసులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని లాయర్లను బెదిరించినట్లు హైకోర్టు దృష్టికి వచ్చింది. దీంతో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్‌ అయింది. ఇది లాయర్లను కాదు వ్యవస్ధను భయపెట్టడమే అని వ్యాఖ్యానించింది. ఇలా అయితే కోర్టులు మూసుకోవాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 హెబియస్‌ కార్పస్‌ వివాదాలు..

హెబియస్‌ కార్పస్‌ వివాదాలు..

రాష్ట్రంలో గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల వ్యవహారం తరచూ తెరపైకి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పోలీసులు తమ కుటుంబ సభ్యులను అపసంహరించారని పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాఖలు చేసిన పిటిషన్లలో పోలీసులు కోర్టుకు సరైన వివరాలు సమర్పించడంలో విఫలం కావడమే కాకుండా పలు సందర్భాల్లో అనుమానాస్పదంగా దర్యాప్తు చేసినట్లు తేలడంతో గుంటూరు కేసులో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల విషయంలోనూ పలు సందర్భాల్లో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పలుచోట్ల తరచూ వ్యక్తులు మాయం కావడం, వాటి వెనుక పోలీసుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో హైకోర్టు ఎప్పటికప్పుడు ఈ పిటిషన్లపై సీరియస్‌ అవుతూనే ఉంది.

 లాయర్లకు పోలీసుల బెదిరింపులు...

లాయర్లకు పోలీసుల బెదిరింపులు...

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విషయంలో హైకోర్టులో బాధితులుగా మారుతున్న పోలీసులు.. ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారం తిరిగి హైకోర్టుకు చేరడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెబియస్ కార్పస్‌ పిటిషన్ల ఉపసంహరణకు లాయర్లను బెదిరించడమేంటని పోలీసులను ప్రశ్నించింది. ఇది లాయర్లను కాదు వ్యవస్ధను భయపెట్టడమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదులు రాకపోతే ఇక కోర్టులు మూసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు ఈ మధ్య కాలంలో రెండోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయింది.

 విజయవాడలో ఏం జరిగిందంటే ?

విజయవాడలో ఏం జరిగిందంటే ?

విజయవాడకు చెందిన రెడ్డి గోవిందరావు... ఆయన కుమారుడు గౌతమ్‌, కోడలు లోచినిలను పోలీసులు గతేడాది అక్టోబర్‌ 28న అక్రమంగా విశాఖ తీసుకెళ్లి నవంబర్‌ 1 వరకూ నిర్బంధించారని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ వేసిన విజయవాడ లాయర్‌ ఇస్మాయిల్ ఇంటికి తెల్లారుజామున వెళ్లిన పోలీసులు వాజ్యం ఉపసంహరించుకోవాలని బెదిరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైకోర్టు.. జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించింది. విశాఖ జడ్జిని దర్యాప్తు అధికారిగా నియమించింది. దర్యాప్తులో పోలీసుల బెదిరింపులు నిజమేనని తేలడంతో హైకోర్టు పోలీసుల తీరుపై సీరియస్‌ అయింది. బీహార్‌లో ఇలాగే ఓ న్యాయవాదిని పోలీసులు బెదిరించారని తెలిసి హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి డీజీపీని కోర్టుకు రప్పించి మందలించారని ధర్మాసనం గుర్తుచేసింది.

  Modi Jagan Meet: జగన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ .. 17 అంశాలపై ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి నివేదన!!
   రాజ్యాంగం చిన్నాభిన్నం అయిందో లేదో తేలుస్తాం

  రాజ్యాంగం చిన్నాభిన్నం అయిందో లేదో తేలుస్తాం

  హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహంగా ఉన్న హైకోర్టు ధర్మాసనం.. వీటితో పాటు రాష్ట్రంలో హైకోర్టు తీర్పులు, వాటిపై వస్తున్న కామెంట్లు, ప్రస్తుతం రాష్టంలో నెలకొన్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని అడ్వకేట్‌ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వీటి ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం చిన్నాభిన్నం అయిందో తేదో తేలుస్తామని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటి ఆధారంగా తదుపరి చర్యలుంటాయని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే పోలీసుల తీరుపై పలు కేసుల్లో స్వయంగా డీజీపీ సవాంగ్‌ హైకోర్టు వచ్చి వివరణ కూడా ఇచ్చిన నేపథ్యంలో న్యాయస్ధానం ఈ కేసులో ఇచ్చే తీర్పు ఉత్కంఠగా మారింది.

  English summary
  andhra pradesh high court is serious on police department for threatening lawyers to withdraw hebius corpus cases. the high court says this is nothing but threatening the judiciary.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X