వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్కూళ్ల విలీనానికి జగన్ పట్టు-ముప్పేటదాడి- కీలకంగా హైకోర్టు ఆదేశాలు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో విద్యాసంస్కరణల్లో భాగంగా స్కూళ్ల విలీనం కోసం జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు క్షేత్రస్దాయిలో తీవ్ర అడ్డంకులు తప్పడం లేదు. ముఖ్యంగా తమ ఇళ్లకు దగ్గరగా ఉన్న స్కూళ్లను ఎక్కడెక్కడకో మార్చి అక్కడికి రావాల్సిందేనంటూ ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు విద్యార్ధులు,వారి తల్లితండ్రులు, టీచర్లలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్దాయిలో వ్యతిరేకత పెరుగుతుండగా.. ఇప్పుడు వారికి విపక్షాలు కూడా తోడయ్యాయి. ఇవాళ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం వెలువరించబోతోంది.

Recommended Video

టీచర్లపై బొత్స ఫైర్,తేల్చనున్న హైకోర్టు *Andhra Pradesh | Telugu OneIndia
 స్కూళ్ల విలీన వివాదం

స్కూళ్ల విలీన వివాదం

ఏపీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యాసంస్కరణలు చేపడుతోంది. ప్రీస్కూళ్లతో పాటు ఫౌండేషన్ స్కూళ్లను తీసుకొస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న వందల స్కూళ్లను విలీనం చేసేస్తోంది. దీంతో పాటే వేలాది మంది విద్యార్ధులు,టీచర్లు కొత్త స్కూళ్లకు మారాల్సిన పరిస్దితి. ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లతో పాటు స్కూళ్లకు దగ్గరగా ఉన్న విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. చివరికి ప్రభుత్వం అమ్మఒడి పథకం వర్తింపజేసినా లేకున్నా తాము మాత్రం స్కూళ్లకు వచ్చేది లేదంటూ విద్యార్దులు చాలా చోట్ల మొరాయిస్తున్న పరిస్ధితి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది.

సహకరించని టీచర్లపై బొత్స ఫైర్

సహకరించని టీచర్లపై బొత్స ఫైర్

విద్యాసంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న స్కూళ్ల విలీన ప్రక్రియకు అందులో కీలకమైన టీచర్ల నుంచే సహకారం లభించడం లేదు. దీంతో టీచర్ల వైఖరిపై ప్రభుత్వం మండిపడుతోంది. తాజాగా విద్యామంత్రి బొత్స టీచర్ల తీరుపై విరుచుకుపడ్డారు. మీ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివించుకుంటూ ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది అంటూ ఉరిమారు. అంతే కాదు పేద పిల్లలు పేదలుగానే ఉండిపోవారా అంటూ మరో ప్రశ్న కూడా వేశారు. దీంతో విద్యామంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

జత కలిసిన విపక్షాలు

జత కలిసిన విపక్షాలు


స్కూళ్ల విలీనంపై క్షేత్రస్ధాయిలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు విపక్షాలు మరోసారి రంగంలోకి దిగాయి. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలకు దిగుతున్న విద్యార్దులు, తల్లితండ్రులు, టీచర్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిన్న చేపట్టిన బస్సుయాత్రను పార్వతీపురం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగానే ఉన్నారు. స్ధానికంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే వైసీపీ నేతలు కూడా పాల్గొంటున్న పరిస్దితి కనిపిస్తోంది.

తేల్చనున్న హైకోర్టు

తేల్చనున్న హైకోర్టు

జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఏపీలో పాఠశాలల విలీనం, టీచర్ల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దీన్ని దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం, పాఠశాలల విలీనం కోసం జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషనర్ కోరుతున్నారు. ఇవి విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోం దని, అంతేకాక ఏపీ హైకోర్టు మాతృభాషలో విద్యా బోధన ఉండాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిం చారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని పాటించడం లేదని, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుణ్ని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

English summary
parents and teachers in andhrapradesh show their anger on jagan govt's schools merger plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X