చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టు కీలక నిర్ణయం..!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇందుకు పలు షరతులు కూడా విధించింది. కానీ మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో అదనపు పిటిషన్
దాఖలు చేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ్టి వరకూ మూడు షరతులు పెట్టి, విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి దీనిపై విచారణ చేపట్టింది.

చంద్రబాబుకు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, ర్యాలీలు చేపట్టకూడదని, మీడియాతో మాట్లాడకూడదని, ఇద్దరు డీఎస్పీలను ఆయనతో పాటు ఉంచాలని ఇలా పలు షరతులు విధించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ్టి వరకూ ర్యాలీలు చేపట్టవద్దని, మీడియాతో మాట్లాడవద్దని షరతులు విధించింది.

ap high court to finalise Chandrababu bail conditions on nov 3

అనంతరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ర్యాలీగా దాదాపు 14 గంటల పాటు ప్రయాణించి రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకున్నారు. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా సీఐడీ లాయర్లు వీడియోలను తీసుకొచ్చి న్యాయమూర్తులకు చూపించారు. కోర్టు షరతుల్ని చంద్రబాబు ఉల్లంఘించారని వాదించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ఎలాంటి షరతులు ఉల్లంఘించ లేదని, చంద్రబాబు మాట్లాడటం ఆయన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే తప్ప అతిక్రమణ కాదన్నారు. గతంలో జైలుశిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే హక్కులు కోర్టులు కల్పించాయన్నారు.

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కు విధించాల్సిన షరతులను ఎల్లుండి ఖరారు చేస్తామని ప్రకటించింది. అంటే ఎల్లుండి వరకూ చంద్రబాబుకు ఊరట లభించినట్లే భావించవచ్చు. వాస్తవానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇవాళ్టి వరకూ మాత్రమే ఆంక్షలు అమల్లో ఉంటాయి. ే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+