ఏపీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలనం ! స్కూళ్లకు పిల్లల్ని రప్పించలేకపోతే రాజీనామా ?
ఏపీలో ప్రభుత్వం భారీ ఎత్తున విద్యాసంస్కరణలు అమలు చేస్తోంది. ముఖ్యంగా అక్షరాస్యత శాతం పెంచేందుకు స్కూళ్లలో నాడు-నేడు పథకం అమలు చేసి రిపేర్లు చేయించడంతో పాటు అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన వంటి ఎన్నో పథకాలు అమలుచేస్తోంది. అయినా పలు చోట్ల విద్యార్ధులు స్కూళ్లకు రావడం లేదు. దీని వెనుక పలు కీలక కారణాలు ఉంటున్నాయి. వీటిని సరిచేసేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్ధుల స్ధూల నమోదు నిష్పత్తి జీఈఆర్ పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఈ విషయంలో ఉపాధ్యాయులను, ఇతర అధికారులను పరుగులు తీయిస్తున్నారు. ఇందులో ఎక్కడ లోపం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటికీ పరాకాష్టగా తానే స్వయంగా సంచలన నిర్ణయం ప్రకటించారు. బడికి రాని పిల్లలందరినీ రప్పించలేకపోతే తానే స్వయంగా ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇందుకోసం డెడ్ లైన్ కూడా ఇచ్చారు.

రాష్ట్రంలో బడి బయట ఉండిపోతున్న పిల్లల్ని స్కూళ్లకు రప్పించడానికి ప్రవీణ్ ప్రకాష్ అధికారులకు ఓ డైడ్ లైన్ ఇచ్చారు. వచ్చే నెల 4వతేదీ లోగా చదువుకు అర్హులై ఉండి స్కూళ్లకు దూరంగా ఉండిపోతున్న విద్యార్ధులందరినీ స్కూళ్లకు రప్పించాలని తెలిపారు. ఇందులో అధికారులు విఫలం అయితే తాను సెప్టెంబర్ 4 తర్వాత రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే బడి బయట ఉంటున్న పిల్లల్ని గుర్తించేందుకు మరో ప్రామాణికం కూడా పెట్టారు.
2005 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్టు మధ్య జన్మించిన పిల్లలందరూ తప్పకుండా స్కూళ్లకు రప్పించాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, జిల్లాల్లో ఇతర అధికారులు అంతా కలిసి సెప్టెంబర్ 4 లోగా వందశాతం విద్యార్ధుల నమోదు నిష్పత్తి రికార్డును సాధించాలని టార్గెట్ పెట్టేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 63 వేల మంది వాలంటీర్లు వందశాతం ఈ నిష్పత్తిని పూర్తి చేశారని, మిగిలిన వారు కూడా దీన్ని పూర్తి చేయాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications