ఒకేసారి ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు: అమ్మాయిలదే హవా, కృష్ణా జిల్లా టాప్
విజయవాడ: మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. రెండింటినీ ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి. 28 రోజుల్లోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 5 శాతం ఎక్కువగా ఉంది.
ఇంటర్ మొదటి సంవత్సరంలో అమ్మాయిలది పైచేయిగా ఉంది. మొదటి సంవత్సరంలో పాస్ శాతం 68.08 శాతంగా ఉంది. ఇంటర్ మొదటి ఏడాది బాలికల ఉత్తీర్ణత 72.09 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 64 శాతంగా ఉంది.

ఫస్ట్ గ్రేడ్‌లో పాసైన వారు 58.29 శాతం, బి గ్రేడ్లో 25.85 శాతం, సీ గ్రేడ్లో 11.18 శాతం, డి గ్రేడ్లో 4.73 శాతంగా ఉంది. ఇంటర్ సెకండియర్లో ఉత్తీర్ణత శాతం 73.78 శాతంగా ఉంది. సెకండియర్లోను అమ్మాయిలో టాప్. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌లో ఉంది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 57 శాతంతో అనంతరం జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. ద్వితీయ ఫలితాల్లో 65 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. మే 24న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.












Click it and Unblock the Notifications