వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..! మండలి ఛైర్మన్ ప్రకటన..
ఎన్నికల వేళ అధికార వైసీపీని వీడి విపక్ష టీడీపీ, జనసేనలోకి ఫిరాయించిన శానసమండలి సభ్యులపై అనర్హత వేటు పడింది. తమ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఏపీ శాసన మండలి ఛైర్మన్ కొయ్య మోషన్ రాజు.. సదరు రెబెల్ ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్నారు. దీనిపై సంతృప్తి చెందని ఆయన .. వారిపై అనర్హత వేటు వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
{image-ysrcpmlcscramachandraiahandvamsikrishnayadav-1710216170.jpg
telugu.oneindia.com}
వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యతో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్ ఈ మధ్యే పార్టీ ఫిరాయించారు. సి రామచంద్రయ్య వైసీపీని వీడి టీడీపీలోకి ఫిరాయించగా.. వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలోకి ఫిరాయించారు. నేరుగా పార్టీ వేదికలపైనే వీరు కండువాలు కప్పుకున్నారు. దీంతో వైసీపీ వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి ఛైర్మన్ కు ఫిర్యాదులు చేసింది.
వైసీపీ నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు.. వీరిద్దరి నుంచి వివరణ కోరారు. దీంతో సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ ఇద్దరూ తమ వివరణలు అందించారు. అనంతరం మండలి ఛైర్మన్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అని తేల్చిచెప్పేశారు. దీంతో వీరిద్దరిపై అనర్హత వేటు వేస్తూ ఛైర్మన్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవీకాలాన్ని వదిలేసి మరీ టీడీపీ, జనసేనలోకి ఫిరాయించడం విశేషం.












Click it and Unblock the Notifications