వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాను వదిలిపెట్టని ఏపీ, కృష్ణా రివర్ బోర్డుకు షాకింగ్ లేఖ, నదీ జలాల పంపిణీపై ట్విస్ట్ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉందా? తాజాగా కృష్ణానది జలాల పంపిణీపై ఏపీ రాసిన లేఖతో తెలంగాణ నీటి వాటాకు చెక్ పెట్టాలని నిర్ణయించిందా? ఇప్పటికే అనేక మార్లు ఏపీ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ రాష్ట్రం చేపట్టిన విద్యుదుత్పత్తిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేక ఫిర్యాదులు చేసిన క్రమంలో నదీజలాల విషయంలో తెలంగాణ సర్కారును టార్గెట్ చేస్తోందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం సమసిపోలేదు అన్న సంకేతం తాజా పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతుంది.

కృష్ణా నదీ జలాల విషయంలో రోజుకో కొత్త సమస్య

కృష్ణా నదీ జలాల విషయంలో రోజుకో కొత్త సమస్య


ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం సమసిపోలేదు. రోజుకో కొత్త సమస్య తెర మీదకు వస్తోంది. మొన్నటికి మొన్న శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపండి అంటూ, విద్యుత్ ఉత్పత్తి కారణంగా సముద్రంలోకి వదిలేస్తున్న వృధాగా పోతున్న నీటిని తెలంగాణ నీటి లెక్కల్లో లెక్కించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సర్కార్ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. ఇక తాజాగా మరోమారు తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు లేఖ రాయడం ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

కేంద్రం పరిధిలోకి నదీ జలాలు వెళ్ళినా మారని తెలుగు రాష్ట్రాల తీరు

కేంద్రం పరిధిలోకి నదీ జలాలు వెళ్ళినా మారని తెలుగు రాష్ట్రాల తీరు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి, రెండు రాష్ట్రాల్లోని నదీ జలాలపై కేంద్రం పెత్తనం చెలాయించే దాకా వచ్చినా, ఏకంగా గెజిట్ జారీ చేసి నదీజలాల పంపిణీని కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నా తెలుగు రాష్ట్రాల తీరు మాత్రం మారడం లేదు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీకి రావాల్సిన నీరు వృధాగా పోతుందని, రాయలసీమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం గత కొంత కాలంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే.

ఇటీవల విద్యుత్ ఉత్పత్తిని టార్గెట్ చేస్తూ, వృధా జలాలపై లేఖ రాసిన ఏపీ

ఇటీవల విద్యుత్ ఉత్పత్తిని టార్గెట్ చేస్తూ, వృధా జలాలపై లేఖ రాసిన ఏపీ


ఇక ఇటీవల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై తెలంగాణా ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిశీలన, ఎన్జీటీ విచారణ ఏపీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టులో సాగిస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ సర్కార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే కానీ రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. చెన్నైకి తాగునీటి కూడా సరఫరా చేయలేమని వెల్లడించారు. విద్యుదుత్పాదనతో వస్తున్న నీటిని సాగర్లో నిలపలేమని కూడా ఏపీ సర్కార్ లేఖ ద్వారా పేర్కొంది. అంతేకాదు పూర్తిస్థాయి నీటిమట్టం సాగర్ లో ఉందని, విద్యుదుత్పాదన కారణంగా వృధాగా పోతున్న జలాలను, తెలంగాణ కోటా నుండి మినహాయించాలని ఏపీ లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చింది .

 మరోమారు నదీ జలాల పంపిణీపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

మరోమారు నదీ జలాల పంపిణీపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

ఇక తాజాగా మరోమారు ఏపీ సర్కార్ తెలంగాణా నదీజలాల పంపకంపై కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ లేఖలో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిందని, ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు పైన ఇంక ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని కూడా ఏపీ సర్కార్ లేఖలో స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో తెలంగాణా ప్రతిపాదించిన 50: 50 ఫార్ములా సమంజసం కాదని జగన్ సర్కార్ రాసిన లేఖలో పేర్కొంది.

ఏపీకి 70 శాతం , తెలంగాణాకు 30 శాతం కేటాయింపులు జరపాలని లేఖ

ఏపీకి 70 శాతం , తెలంగాణాకు 30 శాతం కేటాయింపులు జరపాలని లేఖ

వాస్తవానికి ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు కు విజ్ఞప్తి చేసింది. అప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం నీటిని వినియోగించకుండా ఆదేశాలివ్వాలని జగన్ సర్కార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. మొన్నటికి మొన్న రాసిన లేఖలో వృధా జలాలను తెలంగాణ నీటి వాటా కింద లెక్కించాలని పేర్కొనగా, ఇక తాజాగా ఏపీకి 70 శాతం తెలంగాణకు 30 శాతం కేటాయింపులు జరపాలని, తెలంగాణ నీటి వాటాను టార్గెట్ చేస్తూ లేఖ రాసింది.

కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెస్తున్న ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఏపీ వర్సెస్ తెలంగాణా

కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెస్తున్న ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఏపీ వర్సెస్ తెలంగాణా


ఇక ఇదిలా ఉంటే గతంలోనూ అనేక మార్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖలు రాసింది. కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ జెన్కో శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని వినియోగించుకోవడం పై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికి నాలుగుసార్లు కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు లేకుండా కడుతున్నారని, ఆధారాలను సైతం కృష్ణా రివర్ బోర్డుకిచ్చి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

English summary
Recently, the AP government once again wrote a letter to the Krishna Board on the distribution of Telangana river water. In the letter, the Ap blamed the Telangana government's attitude towards the distribution of Krishna waters. The Krishna tribunal had earlier made water allocations to the two states, the AP government said in a letter. The AP government also clarified in the letter that the project-wise water allocation is still pending before the tribunal and said that the 50:50 formula proposed by Telangana at such a time was not reasonable. AP asking for 70 per cent allocation to ap, and 30 per cent for Telangana water share.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X