AP Liquor Scam: మద్యం స్కాంలో బిగ్ టర్న్-కీలక నిందితుడి అరెస్ట్..!
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్న ఏపీ మద్యం కుంభకోణం (ap liquor scam) లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా భావిస్తున్న వాసుదేవరెడ్డిని సీఐడీ ఇవాళ అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి ఈ కేసులో కీలక సూత్రధాని అని సీఐడీ భావిస్తోంది. దీంతో ఆయన అరెస్టుకు కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి ఏ1 కాగా, వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు.
బేవరెజెస్ కార్పోరేషన్ ఎండీగా పనిచేస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా కొన్ని మద్యం కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదని తేలిపోవడంతో కింది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ జరుగుతుండగానే పోలీసులు వాసుదేవరెడ్డిని అరెస్టు చేసారు. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా.. 27 వరకూ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు.

మద్యం స్కాం జరగడానికి కారణమైన విధాన రూపకల్పన, అమలులో వాసుదేవరెడ్డి పాత్ర ఉందని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏ1తో పాటు చాలా మంది అరెస్టు అయినా వాసుదేవరెడ్డి మాత్రం ఇంకా బయటే ఉన్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఆయన ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం కింది కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సీఐడీ ఆయన్ను అరెస్టు చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆయన అప్రూవర్ గా మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications