కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూల్లో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం-న్యాయరాజధానిలో తొలి ఆఫీసు-తొలి ఫిర్యాదూ

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ఏర్పడిన అడ్డంకులతో రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపూ కష్టంగా మారింది. న్యాయవివాదాల్లో చిక్కుకున్న మూడు రాజధానుల వ్యవహారం తేలితే కానీ అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని మిగతా రెండు రాజధానులకు తరలించే అవకాశం లేదు. కానీ హైదరాబాద్ లో ఉండిపోయిన లోకాయుక్తతో పాటు హెచ్చార్సీ కార్యాలయాల్ని ఏపీకి తరలించే క్రమంలో మాత్రం జగన్ సర్కార్ కు న్యాయ రాజధాని కర్నూలు కలిసివచ్చింది. దీంతో ఇవాళ లోకాయుక్త కార్యాలయం ఇవాళ కర్నూల్లో ప్రారంభించారు.

మూడు రాజధానుల్లో తొలి అడుగు

మూడు రాజధానుల్లో తొలి అడుగు


ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటు చేయదలిచిన మూడు రాజధానుల్లో ఇవాళ తొలి అడుగు పడింది. ఇప్పటివరకూ న్యాయవివాదాల్లో చిక్కుకున్న మూడు రాజధానుల వ్యవహారం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉండిపోయిన ఏపీ లోకాయుక్త, మానవ హక్కుల సంఘం వంటి కార్యాలయాల్ని ఏపీకి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు వీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం.. తొలిసారి న్యాయరాజధానిలో విజయవంతంగా ఓ ప్రభుత్వ సంస్ధను ఏర్పాటు చేయగలిగింది.

 కర్నూల్లో లోకాయుక్త కార్యాలయం మొదలు

కర్నూల్లో లోకాయుక్త కార్యాలయం మొదలు

ఏపీ మూడు రాజధానుల్లో న్యాయరాజధాని అయిన కర్నూల్లో హైకోర్టు, జ్యుడిషియల్ అకాడమీ, లా యూనివర్శిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ లో ఉండిపోయిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్ధల్ని ఇక్కడికి తరలించాలని భావించిుంది. అదే సమయంలో హైకోర్టు కూడా లోకాయుక్త, హెచ్చార్సీలను ఏపీకి తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇదే అదనుగా వైసీపీ సర్కార్ లోకాయుక్తను కర్నూల్లో ఏర్పాటు చేసింది. ఇవాళ లోకాయుక్త కార్యాలయాన్ని న్యాయరాజధానిలో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందు లోకాయుక్త గారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

సేవలు వాడుకోవాలన్న లోకాయుక్త

సేవలు వాడుకోవాలన్న లోకాయుక్త

కర్నూల్లో ఇవాళ లోకాయుక్త కార్యాలయాన్ని ప్రారంభించిన లోకాయుక్త జస్టిస్ పి. లక్షణరెడ్డి లోకాయుక్త సేవల్ని ప్రజలు విరివిగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. లోకాయుక్త సంస్థ సేవలను వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వం లోకాయుక్త సంస్థను కర్నూలులో నెలకొల్పడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రజలకు లోకాయుక్త సంస్థ గురించి అవగాహన లేదన్నారు.. లోకాయుక్త సంస్థను కర్నూలు లో ప్రారంభించడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలలో ఈ చట్టం గురించి బాగా అవగాహన వచ్చి, సేవలను వినియోగించుకొనేందుకు వీలవుతుందన్నారు. పౌరులకు అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వ అధికారి చేయాల్సిన పని చేయలేకపోయినా... చేసిన పని ఏదైన నష్టం కలిగించినా, లోకాయుక్త సంస్థ దృష్టికి తీసుకువస్తే, పరిష్కరించే బాధ్యత లోకాయుక్త సంస్థ తీసుకొని, నేరం చేసిన అధికారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 ఫిర్యాదులకు కర్నూలు రానక్కరలేదు

ఫిర్యాదులకు కర్నూలు రానక్కరలేదు


లోకాయుక్తకు ఫిర్యాదు చేయడానికి ప్రజలు కర్నూలుకు రానవసరం లేదని లోకాయుక్త లక్షణరెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చన్నారు. పౌరులకు ఏమైనా అన్యాయం జరిగితే, ఎవరైనా తమ కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. లోకాయుక్త సంస్థ వెబ్సైట్లో తమ నెంబర్లు ఉన్నాయిని, ఎవరు ఫోన్ చేసినా లోకాయుక్త సంస్థ కార్యాలయ సిబ్బంది ఫోన్ రిసీవ్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇస్తారన్నారు పౌరులకు అన్యాయం జరిగినప్పుడు లోకాయుక్త సంస్థకు ఫిర్యాదు చేస్తే, వల్ల సమస్యలును పరిష్కరించి ధైర్యం కల్పించేందుకు లోకాయుక్త ఉందన్నారు. గ్రామ సచివాలయంలో ప్రజలు తమ సమస్యలను తెలియపరిచి అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు అని లక్షణ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా అవినీతికి, మోసాలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.

లోకాయుక్తకు తొలి ఫిర్యాదు


కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఆరేపల్లి వరలక్ష్మమ్మ అనే వృద్ధురాలు తమ గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి విలీనం చేసుకోవాలని లోకాయుక్తకు మొట్టమొదటి సమస్యను విన్నవిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో సమస్య పరిష్కారం కోసం లోకాయుక్త విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన లోకాయుక్త లక్షణ్ రెడ్డి .. చట్టాలు ఉన్నప్పటికీ వాటిపై అవగాహన లేక చాలా మంది ఉపయోగించుకోలేక పోతున్నారని, అలాంటి వాటిలో లోకాయుక్త కూడా ఒకటి అన్నారు. కోస్తా ప్రాంతంలో లోకాయుక్త సంస్థ బాగా వినియోగించుకుంటున్నారని, ఈ ప్రాంతం లో అంతగా చైతన్యం లేనందువల్ల ఈ ప్రాంతం నుంచి ఫిర్యాదులు రావడం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమకు జరిగిన అన్యాయాలను లోకాయుక్త సంస్థ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

English summary
as part of jagan govt's three capitals ap lokayukta office has started working from kurnool today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X