లోకేష్‌పై అచ్చెన్న సంచలనం: సహచర్యం వల్లే ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి అచ్చెన్నాయుడు టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో నవ్వులు పూయించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి అచ్చెన్నాయుడు టిడిపి కార్యాలయంలో నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో నవ్వులు పూయించారు. గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని వర్థంతిగా సంబోంధించి నాలుక కరుచుకొన్నారు. ఆ తర్వాత మంత్రి నారాలోకేష్ సహచర్యంతోనే తాను కూడ ఈ రకంగా మాట్లాడినట్టు చెప్పగానే అందరూ నవ్వారు.
గుంటూరులోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గౌతు లచ్చన్న 108వ, జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు లచ్చన్న జయంతికి బదులుగా వర్థంతి అంటూ తప్పుగా చెప్పారు. వెంటనే సభలో పాల్గొన్న టిడిపి నేతలు జరిగిన పొరపాటును మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

వెంటనే సర్ధుకొన్న మంత్రి అచ్చెన్నాయుడు తాను పొరపాటున జయంతికి బదులుగా వర్తంతి అన్నానని చెప్పారు. అయితే నారాలోకేష్ సహచర్యం వల్ల తాను కూడ జయంతికి బదులుగా వర్థంతి అంటూ వ్యాఖ్యానించానని చెప్పడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి.
మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కొత్తలోనే లోకేష్ అంబేద్కర్ జయంతిని వర్థంతిగా చెప్పారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications