అమిత్ షా అమాయకుడు- కేంద్రంతో మా బంధం అలా-వారాహియాత్రపై ఆంక్షల్లేవన్న బొత్స..
కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు చెడిపోయాయంటూ వస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయవాడలో స్పందించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోయాయని ఎవరన్నారని ఎదురు ప్రశ్నించారు. కేంద్రంపై ప్రత్యేక హోదా కు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు. పోరాటానికి ఆకారం ఉంటుందా అని అడిగారు. గతంలో తాము ప్రతిపక్ష పార్టీ గా ఉన్నప్పుడు కూడా హోదా అడిగామని గుర్తుచేశారు. తమ ఎంపీలు కూడా నిత్యం దీనిపై పోరాటం చేస్తున్నారని బొత్స తెలిపారు.
కేంద్రానికి వైసీపీ మద్దతుపై బొత్స స్పందించారు. దేశానికి సంబంధించిన అంశం వస్తే బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతు ఇస్తామని బొత్స వెల్లడించారు. అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడన్నారు. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంతని బొత్స ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ యాత్ర అంటే ఏంటో తనకు అర్ధం కావడం లేదన్నారు. కాశీ యాత్ర లాగా వారాహి ఏంటి...అసలు తనకు వారాహి అంటే అర్థం కాలేదన్నారు.

యాత్రకు పర్మిషన్లు ఇవ్వడం పాలనలో ఓ భాగం మాత్రమేనని, సెలెబ్రిటీలు పర్మిషన్ తీసుకుంటారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పవన్ యాత్ర పై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా యాత్ర లు చేసుకోవాలని ఆయనకు సూచించారు. వైసీపీ విముక్త ఏపీ అంటే ఏంటని బొత్స ప్రశ్నించారు. విద్యా విధానం, రైతులకు జరిగే మేలు, వైద్య విధాన నిర్ణయాలు అన్ని ఆపేస్తారా అని అడిగారు. తాము ఒకటి ఇస్తే పవన్ పార్టనర్ రెండు ఇస్తా అంటున్నాడని,అంతిమంగా ప్రజలు కోరుకునేది జరుగుతుందని బొత్స తెలిపారు.












Click it and Unblock the Notifications