మూడేళ్లతర్వాత జగన్ పరిపాలన బాగోలేదని బిజెపికి గుర్తొచ్చిందా: ఉనికి కోసమే సభ: మంత్రి బొత్సా విసుర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజాగ్రహ సభ నేపధ్యంలో అధికార వైసీపీకి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకర్ని మించి ఒకరు పదునైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటం కోసం బీజేపీ సభను నిర్వహిస్తుంటే బీజేపీ సభపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

బీజేపీ ప్రజాగ్రహ సభపై మండిపడిన బొత్సా సత్యన్నారాయణ
బీజేపీ ప్రజాగ్రహ సభ విషయంలో వైసీపీ మంత్రులు ఏపీ బీజేపీ నేతలనే కాదు, జాతీయ స్థాయి నాయకులను, కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఉనికి కోసమే బిజెపి విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఏపీలో మేమున్నామని చెప్పుకోడానికి తాపత్రయ పడుతూ బీజేపీ ఈరోజు సభ నిర్వహిస్తోంది అంటూ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. దేశంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

బీజేపీ ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప మరే ప్రయోజనం లేదు
గత మూడేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తుంటే మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్ పరిపాలన బాగోలేదని బిజెపికి గుర్తొచ్చిందా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏదైనా ఒక సమస్య పై ప్రత్యేకంగా సూచనలు చేస్తే వాటిని స్వీకరిస్తాం తప్ప భారతీయ జనతా పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా స్వీకరిస్తాము అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప మరే ప్రయోజనం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో నీతి అయోగ్ నివేదిక చూస్తే సరిపోతుందని పేర్కొన్న బొత్స సత్యనారాయణ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోవాలి అంటూ చురకలంటించారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకబడింది
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిందని, బిజెపి పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకు లో ఉందో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకబాటులో ఉందో సమాధానం చెప్పాలని బొత్ససత్యనారాయణ డిమాండ్ చేశారు. బిజెపి నేతల మాటలను ప్రజలు నమ్మబోరని బొత్ససత్యనారాయణ తేల్చిచెప్పారు .
Recommended Video

విభజన హామీలు ఇప్పటివరకు కేంద్రం ఏం నెరవేర్చింది?
విభజన హామీలను ఇప్పటివరకు కేంద్రం ఏ మేరకు నెరవేర్చిందో చెప్పాలని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఓటిఎస్ పథకం పై మాట్లాడిన బొత్స సత్యనారాయణ, ఓటిఎస్ పథకం స్వచ్ఛంద పథకమని, ఎవరిపైనా ఎలాంటి బలవంతం లేదని పదేపదే చెబుతున్నప్పటికీ తప్పుడు విమర్శలు చేస్తున్నారు అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఓర్చుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు మంత్రి బొత్సా సత్యన్నారాయణ.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications