రాజధాని రైతులను మోసం చెయ్యొద్దన్న సీపీఐ నారాయణ.. ఫోన్ చేసి హామీ ఇచ్చిన బొత్సా
కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి రాజధాని ప్రాంత రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రాష్ట్ర పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజధాని అమారావతి కోసం ఉద్యమం సాగించిన రైతులకు కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సమయంలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇచ్చే పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం లేదు . ఇక తాజా పరిణామాల నేపధ్యంలో సీపీఐ నారాయణ రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇక బొత్సా నారాయణకు కాల్ చేసి మాట్లాడారు.
రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆయన రాజధాని కోసం రైతులు భూములిచ్చి త్యాగం చేశారని పేర్కొన్నారు . వారికి కౌలు చెల్లించకుంటే వారి బతుకులు ఎలా సాగుతాయని నారాయణ ప్రశ్నించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టవద్దని నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాజధాని తరలింపు విషయాన్ని పక్కన పెట్టి ముందు వారికి కౌలు చెల్లింపులు జరపాలని నారాయణ కోరారు.

అయితే నారాయణ డిమాండ్ పై స్పందించారు ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యన్నారాయణ . బొత్స సత్యనారాయణ సీపీఐ నాయకుడు నారాయణకు ఫోన్ చేసి ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. కరోనా వల్లనే అమరావతి రైతులకు కౌలు ఇవ్వలేకపోయామని చెప్పిన బొత్స, మే నెలలో అమరావతి రైతులకు కౌలు ఇప్పించే బాధ్యత నాది అని మాటిచ్చారు . ఇక ప్రస్తుత కష్టకాలాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. ఏది ఏమైనా సీపీఐ నారాయణకు మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఫోన్ చేసి మాట్లాడటంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications