ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగా లేదనే విమర్శల నేపథ్యంలో తాజాగా కూటమి సర్కార్ వీటిపై ఫోకస్ పెట్టింది. సచివాలయాల్లో ఉద్యోగుల్ని హేతుబద్దీకరించాలని కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్ధితి వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చతో పాటు ప్రమోషన్లు, పీఆర్సీ వేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందులో ఉద్యోగుల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. అలాగే సీనియర్ అధికారుల్ని ఓ కమిటీని నియమించి నిబంధనలు కూడా రూపొందించి అమలు చేస్తామన్నారు.

ap minister dola bala veeranjaneya swamy clarified to village ward secretariat staff removal

అదే సమయంలో ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని సచివాలయ ఉద్యోగుల్ని తొలగిస్తారనే ప్రచారాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారని మంత్రి స్వామి ఆక్షేపించారు. ప్రభుత్వం మాత్రం సచివాలయ ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశం లేదని మంత్రి చెప్పేశారు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలున్నాయని తెలిపారు. మరోవైపు మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా సంక్షేమ శాఖతో పాటు హోంశాఖతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు మంత్రి స్వామి తెలిపారు.

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల్లోనూ భయాలు పెరుగుతున్నాయ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే వాలంటీర్ల వ్యవస్థతో పోలిస్తే సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కాబట్టి వారిని తొలగించడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. అందుకే హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కువగా ఉన్న ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపించే అవకాశముందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+