• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనం

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో వరుసగా అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరినవేళ.. తిరుమల డిక్లరేషన్ అంశం మరో చర్చనీయాంశమైంది. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే హిదువేతరులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలా? లేక ఆప్షన్ మాత్రమేనా? అనే అంశంపై ఏపీలో పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

చర్చిలు, మసీదుల్లో లేదుగా..

చర్చిలు, మసీదుల్లో లేదుగా..


‘‘మన రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ హిందువేతరులను డిక్లరేషన్ కోరరు. ఆయా సందర్భాల్లో చర్చికి వెళ్లినప్పుడు ఏసుక్రీస్తును నమ్ముతావా? అని నన్నెవరూ సంతకం చేయమనలేదు. అలాగే మసీదుల్లోనూ ఈ విధానం లేదు. ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేని డిక్లరేషన్ విధానం తిరుమలలో మాత్రం ఎందుకు? నిజం చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే. కాబట్టి దాన్ని పూర్తిగా తొలగించాలి'' అని మంత్రి నాని అన్నారు.

పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకేపూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే

తిరుమల అపవిత్రం అవుతుందా?

తిరుమల అపవిత్రం అవుతుందా?

చంద్రబాబు స్వతహాగా దేవుణ్ని నమ్మినదాఖలాలు లేవని, భక్తితో గుండు గీయించుకున్న సందర్భాలు కూడా లేవని, అలాంటయన సీఎంగా ఉన్న కాలంలో ఏనాడూ డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని, ఇప్పుడు కూడా తిరుమల డిక్లరేషన్ పై హిందూవాదులు, మతపెద్దలు ఏమీ అనకపోయినా చంద్రబాబు ఒక్కడే ఏవేవో మాట్లాడుతున్నాడని మంత్రి నాని ఆక్షేపించారు. ‘‘సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు ఎవరికీ లేదు. తిరుమలలో మాత్రం ఆ సంప్రదాయం ఎందుకు? కేవలం జగన్ అధికారంలోకి వచ్చినందుకే చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా?''అని నాని ప్రశ్నించారు.

రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - ‘దళారీ కాంగ్రెస్' వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - ‘దళారీ కాంగ్రెస్' వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్

అసలు చట్టం ఏం చెబుతోంది?

అసలు చట్టం ఏం చెబుతోంది?

తిరుమల డిక్లరేషన్ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం పెరుగుతున్న క్రమంలో అసలు చట్టం ఏం చెబుతుందనేది కీలకంగా మారిది. తిరుమల శ్రీవారి ఆలయ పాలనా వ్యవహారాలు టీటీడీ చేతికి వచ్చిన తర్వాత సంస్థాగతంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆక్రమంలోనే టీటీడీ హిందూ మతానికి చెందిన ఓ స్వతంత్ర సంస్థగా అవతరించింది. అసెంబ్లీ ద్వారా ఆ మేరకు చట్టం కూడా తయారైంది. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ చట్టం, జీవో ఎంఎస్ నంబర్ 311 లోని రూల్ నంబర్ 16 ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. 1990లోనే దీనిని చట్టంగా చేశారు. కాగా, ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం సాధ్యం కాబోదంటూ టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణం అయ్యాయి.

నిత్యం లక్షల మంది భక్తులు..

నిత్యం లక్షల మంది భక్తులు..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటం తెలిసిందే. వాళ్లలో హిందువేతరులు ఎవరనేది గుర్తించి, పేరు పేరునా డిక్లరేషన్ తీసుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, ప్రముఖులు, వీవీఐపీలు వచ్చిన సందర్భంలో మాత్రం డిక్లరేషన్ అంశం తరచూ తెరపైకి వస్తోంది. డిక్లరేషన్ చట్టాన్ని తొలగిస్తామని తాము అనేదని, నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చే ఇతర మతస్తుల నుంచి డిక్లరేషన్ కోరడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు. కాగా, తిరుమలలో సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని టీడీపీ, బీజేపీలు వైసీపీ సర్కారును హెచ్చరిస్తున్నాయి. ఈలోపే డిక్లరేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

English summary
political row continues in Andhra pradesh over Tirumala declaration, amid TTD Board decided to not to demand declaration from non-Hindu visitors, opposition tdp and bjp raised their voice against ttd decision. on, ap minister kodali nani made sensational remarks over this issue. speaking to media on sunday, minister nani said, if churches and mosque neen not declaration, why should only in Thirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X