వెలగపూడిలో మంత్రి సునీత ఛాంబర్ ప్రారంభం
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక నుంచి పాలన అమరావతి నుంచే జరుగుతుందని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు ప్రజలకు సరైన రీతిలో సేవలందించాలని ఆమె కోరారు. రేషన్ షాపులు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు డీలర్లు తమ రేషన్ షాపులను తెరచి ఉంచి ప్రజలకు సరుకులు సరఫరా చేయాలని ఆమె సూచించారు. వచ్చే జన్మభూమిలో రేషన్ కార్డులు కావాల్సినవారికి ఇస్తామని అన్నారు.
ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో కొత్త కార్డుల కోసం దరఖాస్తుల నమోదు ఆపివేయడం జరిగిందని, కొత్త దరఖాస్తులు అప్‌లోడ్ అవడానికి వీలుగా వెబ్‌సైట్‌ను తెరవాలని మంత్రి అదికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications