జగన్ సర్కార్ గుడ్ న్యూస్ - కరెంటు కోతలకు చెక్ - ఎప్పటినుంచో తెలుసా ?

ఏపీలో ప్రస్తుతం కరెంటు కోతలు వేధిస్తున్నాయి. అసలే వేసవి ఉక్కపోత, మరోవైపు కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. గ్రామాల్లో అయితే మరీ దారుణంగా గంటల కొద్దీ కరెంటు కోతలు విధిస్తున్నారు. పరిశ్రమలకు అయితే వారానికి రెండు రోజులు పవర్ హాలిడేనే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కరెంటు కోతలపై ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది.

 ఏపీలో విద్యుత్ కష్టాలు

ఏపీలో విద్యుత్ కష్టాలు

ఏపీలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం దీనిలో 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలోను డిమాండ్, సప్లై ల మధ్య భారీగా అంతరం ఉండటంతో ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ విద్యుత్ లభ్యత లేక సాధ్యపడటం లేదని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత వల్ల కొన్ని థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదే సమయంలో కోవిడ్ తర్వాత ఆర్థిక కలాపాలు పుంజుకోవటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో నిరంతరంగా నడిచే పరిశ్రమలకు 50 శాతం లోడ్ రిలీఫ్ ను అమలు చేస్తున్నారు. మరికొన్ని పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్ారు.

 మే 1 నుంచి కోతలకు చెక్

మే 1 నుంచి కోతలకు చెక్

రాష్ట్రంలో మరో రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైనట్లు ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇవాళ ప్రకటించారుు. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుండి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా పై ఏపీ జెన్ కో, ఎపి ట్రాన్స్ కో నెడ్ క్యాప్, ఏపీఎస్ఈసిఎంల అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణపట్నంలో మరో నెలలో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) లో మరో మూడు, నాలుగు నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. కృష్ణపట్నం యూనిట్ ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాక కొత్తగా మరో 6000 మెగావాట్ల హైడెల్ ( పంప్డ్ హైడ్రో స్టోరేజీ ) సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.

 ప్రజలు సహకరించాలన్న పెద్దిరెడ్డి

ప్రజలు సహకరించాలన్న పెద్దిరెడ్డి

భవిష్యత్ లోనూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ను కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుత సమస్య కేవలం బొగ్గు కొరత వలనే ఏర్పడిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించి సరఫరాను యధా స్థితికి తీసుకురావటానికి విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయన్నారు. వినియోగదారులంతా ఈ సమయంలో విద్యుత్ సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగి పవర్ ఎక్స్ఛేంజీలలో కొనేందుకు కూడా విద్యుత్ దొరకని ఈ సమయంలో కూడా వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+