Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమాషాలు చేస్తున్నారా? ఇక్కడితో అయిపోలేదు?: పోలీసు అధికారిపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, సీఎం జగన్ పోలవరం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జీ మంత్రి హోదాలో పేర్ని నాని అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడ మంత్రి కారు అడ్డుగా ఉందని.. దాన్ని పక్కకు తీయాలని ప్రోటోకాల్ సిబ్బంది చెప్పడంపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమాషాలు చేస్తున్నారా?: పోలీసు అధికారిపై పేర్ని నాని ఫైర్

తమాషాలు చేస్తున్నారా?: పోలీసు అధికారిపై పేర్ని నాని ఫైర్

కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు సమీపంలోకి ఇతరులెవరికీ అనుమతించలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేలను కూడా అనుమతించకపోవడంతో వారంతా అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉన్న పేర్ని నాని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. మంత్రి వాహనం అడ్డుగా ఉందని, దాన్ని తీయాలని చెప్పడంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అక్కడున్న పోలీసు అధికారిని తీవ్రంగా హెచ్చరించారు. 'ఈ కార్లన్నీ ఎవరివి? తమాషాలు చేస్తున్నార? కారు తీయమన్నది ఎవరు? ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి? నాకంటే వాళ్లు ఎన్ని డిసిగ్నేషన్లు తక్కువ? మర్యాదగా ఉండదు. ఇక్కడితో పండగ అయిపోలేదు' అని పేర్ని నాని తీవ్రంగా స్పందించారు.

పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం: కేంద్రమంత్రి షెకావత్


కాగా, శుక్రవారం పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ సీఎం వైఎస్ జగ‌న్‌ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రమంత్రి వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్రమంత్రి షెకావత్‌... వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వసతులు చాలా బాగున్నాయని షెకావత్ కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని సీఎం వైఎస్ జగన్ వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు.

జగన్‌ను అభినందించిన కేంద్రమంత్రి షెకావత్

కాగా, పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ పునరావాస కాలనీలో అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నట్లు కొందరు నిర్వాసితులు తెలిపారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణాలు మరింత నాణ్యంగా ఉండేలా అధికారులు దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని సీఎంకు సూచించారు. వ్యవసాయంతోపాటు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కేంద్రమంత్రి. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయిలోని నిర్వాసిత కాలనీలో మంత్రి షెకావత్‌, సీఎం జగన్ పర్యటించారు. ఇళ్ల నిర్మాణాలను, సౌకర్యాలను పరిశీలించిన కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఉన్న మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+