Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ మంత్రి వేణు పాదపూజ-సేవా భావానికి ప్రణామాలు..!

ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనం సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పండుగను సైతం పక్కనబెట్టి తమ విధుల్లో నిమగ్నమవుతున్నారు. దీంతో వీరి సేవల్ని గుర్తించిన సమాచార, పౌరసంబంధాల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అరుదైన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాదపూజ చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వద్ద ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవా భావానికి ప్రణామాలు అర్పిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యర్ధాలను విడిచిపెట్టిన వాటిని శుభ్రం చేసి సమాజానికి స్వచ్ఛతను అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భోగి పర్వదినాన పాదాభివందనం, రోగాన్ని తరిమికొట్టి ఆరోగ్యాన్ని అందించే సమాజానికి సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులకు సంక్రాంతి వందనాలర్పిస్తూ,అసాంఘిక శక్తుల నుండి సమాజానికి రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛ కోసం నిరంతరం తమ సుఖాలను ఆప్యాయతలను త్యాగం చేస్తూ స్వేచ్ఛను ప్రసాదిస్తున్న పోలీసు సిబ్బందికి సంక్రాంతి సత్కార సుమాలు అర్పిస్తూ గౌరవ శాల్యూట్ చేస్తున్నందుకు మంత్రిగా గర్విస్తున్నానన్నారు.

ap minister venugopala krishna bent before sanitary workers for their service on pongal

అలాగే నిత్యం మనకు సేవ అందజేయడంలో ముందు నిలుస్తూ, మన కోసం తపిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వచ్ఛతను అందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, స్వేచ్ఛను కల్పిస్తున్న పోలీసులకు, మన ఆరోగ్యానికి సేవలందిస్తున్న డాక్టర్లు హాస్పిటల్ సిబ్బందికి పాదాలు కడిగి పూల హారాలు దుస్తాలతో సన్మానించి దుస్తులను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదాం శెట్టి శ్రీదేవి,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ap minister venugopala krishna bent before sanitary workers for their service on pongal
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+