Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలా జరిగితే వాలంటీర్లకు రూ.15 వేలు ? జరగకపోతే ఉద్యోగాలు ఊస్ట్ ! మంత్రి విశ్వరూప్ హింట్.. !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు లబ్దిదారుల ఇళ్లకు చేర్చేందుకు వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పెన్షన్లు ఇళ్లకు వెళ్లి అందించడం, సర్వేలు చేయడం, లబ్దిదారుల్ని ప్రభుత్వానికి మద్దతుగా ఉంచడం వీరి పనులు. అయితే ఇంత చేస్తున్నా రాష్ట్రంలో విపక్షాల నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు మంత్రి విశ్వరూప్ ఓ ఆఫర్ తో కూడిన హెచ్చరిక చేశారు. త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి గారి ఆఫర్ కమ్ హెచ్చరికపై చర్చ జరుగుతోంది.

ఏపీలో వాలంటీర్ల హవా

ఏపీలో వాలంటీర్ల హవా

ఏపీలో దశాబ్దాలుగా ప్రజలకు, సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఏదైనా పని కావాలంటే ముందుగా రాజకీయ నేతల్ని ఆశ్రయించేవారు. ముఖ్యంగా చిన్నస్దాయి నేత నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకూ ఆశ్రయించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ నిర్ణయంతో ఆ పని తప్పింది. వీరందరికీ బదులు వాలంటీర్లను నమ్ముకోండి మీ పనులన్నీ పూర్తవుతాయన్న సంకేతాల్ని జగన్ పంపారు. దీంతో వాలంటీర్లకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి అనుబంధంగా ఉంటే చాలు, అర్హతలతో సంబంధం లేదంటూ నియమించిన వాలంటీర్ల హవా ఇప్పటికీ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ వీరు కీలక పాత్ర పోషించబోతున్నారు.

 గౌరవ వేతనం పెంపు డిమాండ్

గౌరవ వేతనం పెంపు డిమాండ్

అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్న వాలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ గౌరవ వేతనాన్ని కనీసం రూ.15 వేలకు పెంచాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మీరు చేస్తుంది ఉద్యోగం కాదు సేవ మాత్రమే అని తేల్చిచెప్పేసింది. కాబట్టి వీరి సేవకు గుర్తింపుగా ఏటా దాదాపు రెండు లక్షల మందికి సేవా అవార్డులు, రివార్డుల పేరుతో 10 వేల నుంచి 25 వేల వరకూ బోనస్ లా ఇచ్చేస్తున్నారు. తద్వారా వారికి కాస్త ఊరటనిస్తున్నారు. అయితే విపక్ష టీడీపీ తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.15 వేలు ఇస్తామని ఆఫర్ చేస్తోంది. దీంతో వాలంటీర్లు ఆలోచనలో పడుతున్నారు.

వాలంటీర్లకు మంత్రి విశ్వరూప్ హింట్

వాలంటీర్లకు మంత్రి విశ్వరూప్ హింట్

ఈ తరుణంలో వైసీపీ మంత్రి విశ్వరూప్ తాజాగా వాలంటీర్లకు ఓ హింట్ ఇచ్చారు. గౌరవ వేతనం పెంపుపై వారిలో ఉన్న ఆవేదనను గమనించి వారికి ఓ కీలక ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచేందుకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని వాలంటీర్లకు విశ్వరూప్ చెప్పేశారు. దీంతో వారిలో అసంతృప్తిని కాస్తయినా తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుందన్నారు. తద్వారా వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదే అన్నట్లుగా చెప్పేశారు.

వైసీపీ రాకపోతే వాలంటీర్ల తొలగింపు ?

వైసీపీ రాకపోతే వాలంటీర్ల తొలగింపు ?

అదే సమయంలో వాలంటీర్లకు మంత్రి విశ్వరూప్ మరో హెచ్చరిక కూడా చేశారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాకపోతే మాత్రం వాలంటీర్ల తొలగింపు తప్పదని హెచ్చరించారు. అంటే వైసీపీ అధికారంలోకి రాకపోతే విపక్షాలు అధికారంలోకి వచ్చి మిమ్మల్ని తొలగించడం ఖాయమనేలా ఈ హెచ్చరిక ఉంది. దీంతో వైసీపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చి మీ ఉద్యోగాలు కాపాడుకోవాలని వాలంటీర్లకు మంత్రి చెప్పినట్లయింది. దీనిపై వాలంటీర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వైసీపీ కోసం ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నామని, అయినా అధికారంలోకి రాకపోతే తామేం చేస్తామనే భావన వారిలో వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+