తీరు మార్చుకో: హీరో శివాజీకి బీజేపీ మంత్రి వార్నింగ్
హైదరాబాద్: సినీ నటుడు, తమ పార్టీ నేత శివాజీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు మంగళవారం అన్నారు. శివాజీ తీరుపై మాణిక్యాల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న సోము వీర్రాజును ప్రశ్నించడం సరికాదని, ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శివాజీ సోమవారం నాడు కృష్ణా నదిలో జలదీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు నిర్ణయం వెలువడకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.
లేదంటే ఏపీని ఏకపక్షంగా విభజించి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన పార్టీలు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హోదాపై దృష్టి పెట్టాలని కోరారు. అంతేకాదు, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజును ఎవరని ప్రశ్నించారు. దీనిపై మాణిక్యాల రావు మంగళవారం స్పందించారు.












Click it and Unblock the Notifications