రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్! తండ్రి శవం పక్కన గుర్తుందా, చిరంజీవి అలా చేయలేకపోయారు: సుజాత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తండ్రి శం పక్కన పెట్టుకొని అధికారం కోసం పాకులాడిన వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వంటి వారు భక్తులను ఓదార్చి, సానుభూతి తెలిపే బదులు సీఎం చంద్రబాబు రాజీనామా కోరడం విడ్డూరమని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత మంగళవారం మండిపడ్డారు.

రాష్ట్రంలోని ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్దంగా అన్ని ఏర్పాట్లనూ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు.

AP Ministers counter to YS Jagan and Chiranjeevi

భక్తులకు మనోధైర్యం కల్పించే బదులు రాజీనామా కోరడం విడ్డూరమన్నారు. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ సంఘటనను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం విడ్డూరమన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు బాగుందని, తమ్ముడికి ఉన్న సానుభూతి అన్నయ్య చిరంజీవికి లేకుండా పోయిందన్నారు. రాజమండ్రిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.

English summary
AP Ministers counter to YS Jagan and Chiranjeevi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X