కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం: జగన్ ఎలక్షన్ టీం ఇదే..!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో మరో కీలక ఘట్టం ముగిసింది. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం సాయంత్రం ఆమోదం తెలిపారు. కాగా, 11 మంది పాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది

సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు అందడంతో వారంతా విజయవాడ చేరుకున్నారు. ఇక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్ టూ మినిట్ లైవ్ మీకోసం

AP new ministers swearing in ceremony live updates in telugu.

Apr 11, 2022, 12:28 pm IST
ఆంధ్రప్రదేశ్

జాతీయ గీతంతో ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారం.
Apr 11, 2022, 12:26 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజిని. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆమె నియోజకవర్గం చిలకలూరిపేట.
Apr 11, 2022, 12:24 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తానేటి వనతి. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి
Apr 11, 2022, 12:22 pm IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేసిన సీదిరి అప్పలరాజు. భుజం తట్టి ప్రోత్సహించిన వైఎస్ జగన్.
Apr 11, 2022, 12:21 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు. పలాస ఆయన నియోజకవర్గం. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి.
Apr 11, 2022, 12:20 pm IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేసిన రోజా. తలపై చేయి ఉంచి ఆశీర్వదించిన వైఎస్ జగన్.
Apr 11, 2022, 12:19 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కే రోజా. చిత్తూరు జిల్లా నగరి ఆమె నియోజకవర్గం. రోజా పేరును పిలిచిన సమయంలో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది.
Apr 11, 2022, 12:17 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత పీడిక రాజన్నదొర. సాలూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.
Apr 11, 2022, 12:14 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత పినిపె విశ్వరూప్. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అమలాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా రెండోసారి.
Apr 11, 2022, 12:12 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం ఇంగ్లీష్‌లో సాగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఆయన నియోజకవర్గం. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా రెండోసారి.
Apr 11, 2022, 12:10 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మేరుగ నాగార్జున. వేమూరు ఆయన నియోజకవర్గం.
Apr 11, 2022, 12:09 pm IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేసిన ఉషశ్రీ చరణ్. తలపై చేయి ఉంచి ఆశీర్వదించిన వైఎస్ జగన్.
Apr 11, 2022, 12:08 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కురుబ ఉషశ్రీ చరణ్. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆమె ప్రమాణ స్వీకారం ఇంగ్లీష్‌లో సాగింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆమె నియోజకవర్గం.
Apr 11, 2022, 12:06 pm IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేసిన కే నారాయణ స్వామి. వద్దంటూ వారించిన వైఎస్ జగన్
Apr 11, 2022, 12:04 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కే నారాయణ స్వామి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఆయన నియోజకవర్గం. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా రెండోసారి.
Apr 11, 2022, 12:02 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొట్టు సత్యనారాయణ. తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Apr 11, 2022, 12:00 pm IST

మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన కారుమూరి వెంకట నాగేశ్వర రావు. ఆయన తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే.
Apr 11, 2022, 11:58 am IST

మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన.
Apr 11, 2022, 11:57 am IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ వద్ద మోకాళ్ల మీద కూర్చుని ధన్యవాదాలు తెలిపిన జోగి రమేష్. వారించిన వైఎస్ జగన్
Apr 11, 2022, 11:56 am IST

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన జోగి రమేష్. ఆయన పెడన ఎమ్మెల్యే.
Apr 11, 2022, 11:54 am IST

ప్రమాణ స్వీకారం చేసిన గుమ్మనూరి జయరాం. ఆయన నియోజకవర్గం ఆలూరు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా రెండోసారి.
Apr 11, 2022, 11:52 am IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేసిన అమర్‌నాథ్. వారించిన వైఎస్ జగన్
Apr 11, 2022, 11:51 am IST

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన గుడివాడ అమర్‌నాథ్. అనకాపల్లి నుంచి గెలుపొందారు. ఆయన పేరును పిలిచిన సమయంలో ప్రాంగణం హోరెత్తింది.
Apr 11, 2022, 11:49 am IST

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద రావు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
Apr 11, 2022, 11:47 am IST
ఆంధ్రప్రదేశ్

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన దాడిశెట్టి రామలింగేశ్వర రావు అలియాస్ దాడిశెట్టి రాజా. ఆయన తుని ఎమ్మెల్యే.
Apr 11, 2022, 11:45 am IST
ఆంధ్రప్రదేశ్

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఆయన నియోజకవర్గం రామచంద్రాపురం. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు.
Apr 11, 2022, 11:43 am IST
ఆంధ్రప్రదేశ్

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్. డోన్ ఎమ్మెల్యే. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం వరుసగా రెండోసారి. కీలకమైన ఆర్థిక శాఖకు ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు.
Apr 11, 2022, 11:42 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పాదనమస్కారం చేయబోయిన ముత్యాల నాయుడు. వారించిన వైఎస్ జగన్
Apr 11, 2022, 11:41 am IST
ఆంధ్రప్రదేశ్

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన బూడి ముత్యాల నాయుడు. ఆయన నియోజకవర్గం మాడుగుల.
Apr 11, 2022, 11:39 am IST
ఆంధ్రప్రదేశ్

దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ. ఆయన నియోజకవర్గం చీపురుపల్లి. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెండోసారి.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+