టీడీపీ-జనసేన వర్సస్ వైసీపీ : ఎవరికి ఎన్ని సీట్లు - తాజా సర్వే సంచలనం..!!
ఏపీలో అధికారం దక్కేదెవరికో సర్వే సంస్థ వెల్లడించింది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసింది.
ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. పార్టీలు ముందస్తుగానే సమాయత్తం అవుతున్నాయి. నేతల పార్టీ జంపింగ్స్ మొదలయ్యాయి. పొత్తుల వ్యవహారం అనధికారికంగా ఖరారవుతున్నాయి. ఇదే సమయంలో పార్టీలు అభ్యర్ధుల ఎంపిక కసతర్తు వేగవంతం చేసాయి. సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దాని పైన సర్వేలు మొదలు పెట్టాయి. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా. అధికారంగా ఖరారు కాలేదు. వైసీపీ తిరిగి అధికారం తమదేనని ధీమగా ఉంది. టీడీపీ - జనసన కలిస్తే గెలుపు గ్యారంటీ అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో తాజా పరిస్థితులపై అధ్యయనం చేసింది. సర్వే నిర్వహించింది. గెలుపు దక్కేదెవరికో అందులో తేల్చింది.

పొత్తులు - గెలుపు అవకాశాలు
ఏపీలో టీడీపీ- జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా..ఇప్పటికీ అనధికారమే. ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారం ఖాయమనే ప్రచారంలో అమరావతి కేంద్రంగా ఓ ప్రముఖ సర్వే సంస్థ తాజాగా ప్రజానాడి తెలుసుకొనే ప్రయత్నం చేసింది. అందులో అనూహ్య అంచనాలను వెల్లడిచింది. టీడీపీ - జనసేన పొత్తు ఉంటే ఎన్ని సీట్లు వస్తాయి..వైసీపీకి దక్కే సీట్లెన్ని..అదే విధంగా పొత్తు లేకపోతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తయనే అంచనాలు బయట పెట్టింది. సీట్లతో పాటుగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార పార్టీల నేతల వివరాలను బహిర్గతం చేసింది. 2019ఎన్నికల నాటికి..ఇప్పటికీ పార్లమెంట్ సీట్ల వారీగా ఏ పార్టీ ఏ స్థితిలో ఉందనే విషయాలను సర్వేలో తేల్చింది. మూడు రాజధానుల వివాదం వేళ..మూడు ప్రాంతాల్లో పార్టీల పైన ప్రభావం..ఆ పరిధిలోని సీట్లలో గెలుపు - ఓటములను విశ్లేషించింది. ఈ సర్వేలో రాయలసీమలో వైసీపీ బలం స్వల్పంగా మినహా ఎక్కడా చెక్కు చెదరలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

అధికారం దక్కేదెవరికి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు
ఈ సర్వేలో ఆసక్తి కర అంశాలు వెల్లడయ్యాయి. టీడీపీ - జనసేన పొత్తు తో ఎన్నికల బరిలో దిగినా ..పొత్తు లేకపోయినా వైసీపీదే విజయమని సర్వే సంస్థ గణాంకాలతో సహా తేల్చింది. టీడీపీ -జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి 100 నుంచి 110 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ తేల్చింది. టీడీపీ 45 నుంచి 55 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. జనసేన 6 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉందని లెక్కలు వెల్లడించింది. ఒక వేళ టీడీపీ - జనసేన పొత్తు లేకుండా వేర్వేరుగా పోటీ చేస్తే అధికార వైసీపీకి 118 స్థానాల నుంచి 130 వరకు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేల్చింది. పొత్తు ఉన్నా..లేకపోయినా టీడీపీకి దక్కే సీట్లలో పెద్ద తేడా లేదనేది సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల్లో స్పష్టం అవుతోంది. పొత్తు లేకుండా బరిలోకి దిగితే టీడీపీకి 39-46 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, జనసేనకు మూడు నుంచి 5 సీట్ల వరకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తేల్చింది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసినా..పెద్దగా తేడా లేదనేది సర్వే లెక్కలు సూచిస్తున్నాయి.

హోరా హోరీ - వారి పై వ్యతిరేకత
పొత్తు లేకపోతే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరా హోరీ తప్పదని సర్వే సంస్థ తేల్చింది. అదే సమయంలో అధికార పార్టీలో ముగ్గురు తాజా..మరో ఇద్దరు మాజీ మంత్రులతో సహా మొత్తంగా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల పైన బాగా వ్యతిరేకత ఉందని ఈ సంస్థ సర్వేలో తేల్చింది. ప్రస్తుత మంత్రుల్లో అంబటి రాంబాబు.. గుడివాడ అమర్నాధ్..విశ్వరూప్ పేర్లను ప్రస్తావించింది. మాజీల్లో పేర్నినాని, అవంతి శ్రీనివాస్ తమ నియోకవర్గాల్లో వెనుకబడి ఉన్నట్లుగా పేర్కొంది. గుడివాడ వైసీపీకి..గన్నవరం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తేల్చింది. ఇక లోక్ సభ సీట్లలో వైసీపీ 19 నుండి 21 దక్కే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. టీడీపీకి రెండు నుండి నాలుగు సీట్లు దక్కుతాయని పేర్కింది. జనసేన - బీజేపీకి లోక్ సభ సీట్లు దక్కే అవకాశం లేదని అంచనాకు వచ్చింది, హోరాహోరీ పోరు నాలుగు స్థానాల్లో ఉంటుందని సర్వే సంస్థ తమ అంచనాల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ సర్వే తో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications