టిడిపి ఇలా...వైసిపి అలా:దొందూ దొందేనా?...చాలా నష్టం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఎపికి జరిగిన అన్యాయంపై రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సింది పోయి ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసమే వెంపర్లాడటాన్నిరాష్ట్ర ప్రజల్లో కొన్ని ప్రధాన పార్టీల పట్ల ఏహ్య భావాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఆంధ్ర్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నతీరు ఆ పార్టీల విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీస్తోంది.

ఆంధ్రాకు అన్యాయం జరిగింది టిడిపి వల్లేనని...చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని...టిడిపి మంత్రులు రాజీనామా చేసినా చంద్రబాబు ఇంకా ఎన్డీఏలో కొనసాగడం మోసపూరితమని...ప్రజలు చంద్రబాబు మోసాలను అర్ధం చేసుకోవాలని...వైసిపి అధికార ప్రతినిధి పార్థసారిధి ధ్వజమెత్తారు. మరోవైపు టిడిపి మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైసిపి ఒక పక్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంటూనే మరోపక్క ప్రత్యేక హోదా మోడీ ఇస్తారనే నమ్మకం తమకు ఉందనడం వైకాపా మోసానికి నిదర్శనం అని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎపిలో అధికార,ప్రతిపక్ష పార్టీలు దొందూ దొందేనని ప్రజలు భావిస్తున్నారు.

 వైకాపా...ఏమంటోందంటే...మోసం కాదా?

వైకాపా...ఏమంటోందంటే...మోసం కాదా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ "చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ...టీడీపీ మంత్రులు రాజీనామా చేసినా...ఎన్డీయేలో కొనసాగడం మోసపూరితం కాదా..కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదా...ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్నమోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలి...చంద్రబాబు మంత్రులు రాజీనామా చేస్తారట. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారంట. ఇంతకన్నామోసం ఏమైనా ఉందా?...ఇలా ఎవరైనా చేస్తారా అంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే చేయగలరు."...అన్నారు.

టిడిపిపై...వైకాపా మరి కొన్ని ఆరోపణలు.

టిడిపిపై...వైకాపా మరి కొన్ని ఆరోపణలు.

కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉండి ప్రత్యేక హోదా సంజీవని కాదు, ముగిసిపోయిన అధ్యాయం, జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని రకరకాల భాష్యాలు చెప్పిన చంద్రబాబు...ప్రత్యేక హోదాపై యూటర్న్‌తీసుకున్నారన్నసంగతి అందరికీ అర్ధమైంది...అయితే ఆయన ఇంకా ఎన్‌డీఏ కూటమిలో కొనసాగాలనుకోవడం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏం వస్తుందని వైసిపిని అంటున్నారంటే చంద్రబాబు తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి...నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు...ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటున్నారని గుర్తు చేశారు. మొన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు...29సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్ని కలిశానని గొప్పగా చెబుతున్నారని, అన్నిసార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా అని పార్ధసారధి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ మన అభివృద్ధిని చెప్పమని చంద్రబాబు తన ఎంపీలకు చెబుతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, కమీషన్లకు అడ్డుపడకుండా, అంచనాలు పెంచండి, వైఎస్‌ఆర్‌సీపీని అణచమని కేంద్ర మంత్రులను కోరినట్లు వారే చెబుతున్నారని చంద్రబాబుపై వైసిపి నేత పార్థసారధి విమర్శల వర్షం కురిపించారు.

 వైకాపా...భలే మోసకారి:నక్కా ఆనందబాబు

వైకాపా...భలే మోసకారి:నక్కా ఆనందబాబు

మరోవైపు వైకాపానే నీచ రాజకీయాలకు పాల్పడుతోందని టిడిపి మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వైకాపా వ్యవహారం ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటున్న వైసిపి ఇంకో పక్క ప్రధాని మోడీపై తమకు నమ్మకం ఉందని, ఆయన ప్రత్యేక హోదా ఇస్తారన్న విశ్వాసం తమకు ఉందని చెప్పడం ఏ తరహా రాజకీయమన్నారు. దీన్నిబట్టే వైసిపి డబుల్ గేమ్ ఆడుతోందని ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. ఇలాంటి వైసిపి అవిశ్వాస తీర్మానం అంటే హాస్యాస్పదంగా ఉందని, ప్రజలు నవ్వుకుంటున్నారని వైకాపాపై నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

 ఫైనల్ గా...దొందూ దొందే:ప్రజాభిప్రాయం

ఫైనల్ గా...దొందూ దొందే:ప్రజాభిప్రాయం

ఈ రెండు పార్టీలు ఒకరిపైమరొకరు చేసుకుంటున్నఆరోపణలన్నీ నిజమేనని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. తద్వారా ఈ రెండు పార్టీలు దొందూ దొందేనని భావిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఇతర వ్యవహారాలన్నీ కట్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాల్సిన అతి ముఖ్యమైన అధికార,ప్రతిపక్ష పార్టీలు టిడిపి-వైసిపి ఇలా ఈ పరిస్థితుల్లోనూ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతి అడుగు కదుపుతుండటం రాష్ట్ర ప్రజల్లో ఈ రెండు పార్టీల పట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తోంది. నిజంగా ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని చూరగొనేందుకు కలిసి పనిచేసి ఉంటే ఇరు పార్టీల విశ్వసనీయత బాగా పెరిగేది. కానీ అత్యంత కీలకమైన తరుణంలో ఈ రెండు పార్టీలు ఒకరినొకరు దెబ్బతీయడానికే ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు అసలు అన్యాయం జేసిన బిజెపితో సహా ఈ రెండు పార్టీల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నదే అసలు నిజం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The attitude of TDP and YCP in case of injustice to the AP has increased the disgust on these both parties. In this crucial situation, the two parties are giving preference to their own political interests...is growing opposition in the state people.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి