AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!
ఏపీలో ఆస్తిపన్ను (property tax) చెల్లింపుదారులకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలు) పరిధిలో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిల్ని క్రమంగా వసూలు చేసుకునేందుకు వీలుగా తాజాగా వాటిపై వడ్డీ రాయితీ ప్రకటించింది. ఇలా పాత బకాయిలు చెల్లించే వారికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో చాలా మటుకు బకాయిలు వసూలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ గడువును పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పౌరులు తమ పాత బకాయిలను తక్కువ ఆర్థిక భారంతో క్లియర్ చేసుకునేందుకు ఇదొక చక్కని అవకాశమని ఆయన తెలిపారు.

దీంతో పాటు రాబోయే ఆర్థిక సంవత్సరం (2026-27) పన్నును ముందుగానే చెల్లించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించాలని కూడా నిర్ణయించారు. ఏప్రిల్ 30, 2026 లోపు పన్ను మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన వారు 5% ముందస్తు రాయితీ పొందవచ్చని పురపాలక శాఖ కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వడ్డీ మాఫీ, పన్ను రాయితీ వంటి ప్రయోజనాలను పొందాలని ఆస్తిపన్ను చెల్లింపుదారుల్న కోరుతున్నారు.












Click it and Unblock the Notifications