ఏపీలో తిష్ట వేసుకు కూర్చున్న వరుణదేవుడు.. రేపు, ఎల్లుండి దబిడి దిబిడే!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నా వర్షాలు మాత్రం వదలడం లేదు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీన పడిందని అయినప్పటికీ నేడు రేపు కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.

రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు
ఇక ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇక వర్షాలు కురిసే నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో నిలువ చేసుకోవాలని, తడవకుండా చూసుకోవాలని సూచించారు.

ap rains update moderate rains in AP due to bay of bengal low pressure IMD alert

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పంపేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, అనంతపురం, వైయస్సార్ మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

తేలికపాటి వర్షాలు కురిసే జిల్లాలు ఇవే
అంతేకాదు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, సత్య సాయి, అనంతపురం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.

ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అలాగే నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఏది ఏమైనా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+