పదో తరగతి ఫలితాలలో అమ్మాయిలదే హవా
హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి-బ్లాకులోని కాన్ఫరెన్స్ హాలులో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్, మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ మీడియా సమావేశంలో ఫలితాల సీడీని విడుదల చేశారు.
ఫలితాలకు...

పదో తరగతి ఫలితాలలో అమ్మాయిలదే హవా. ఉత్తీర్ణత శాతం 88.62గా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 89.33గా ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 87.96గా ఉంది. మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా, చివరి స్థానంలో అదిలాబాద్ జిల్లా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఉత్తీర్ణత శాతం 96.26గా ఉండగా, అదిలాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం 58.31గా ఉంది. 5,784 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత రాగా, 77 పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం జీరోగా ఉంది.












Click it and Unblock the Notifications