విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం- రంగంలోకి ఇతర రాష్ట్రాల ఎస్‌ఈసీలు- ప్రత్యేక పరిశీలకులుగా

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కారు వర్సెస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌గా సాగిపోతున్న పంచాయతీ ఎన్నికల పోరు మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డకు సహకారం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అక్రమాలకు తావులేకుండా సజావుగా సాగడంతో పాటు ఆయన ప్రతిష్టను కూడా పెంచబోతోంది. మరోవైపు ఇది వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశాలూ లేకపోలేదు.

జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ వార్‌- నేడు నిమ్మగడ్డకు అసెంబ్లీ నోటీసులు- రాజ్యాంగ సంక్షోభం తప్పదా ?జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ వార్‌- నేడు నిమ్మగడ్డకు అసెంబ్లీ నోటీసులు- రాజ్యాంగ సంక్షోభం తప్పదా ?

జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ పంచాయతీ

జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ పంచాయతీ


పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖాముఖీ తలపడిన జగన్‌ సర్కార్‌, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ఆయన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుండగా.. ప్రభుత్వంతో సంబంధం లేకుండానే నిమ్మగడ్డ కూడా తనంతట తాను సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. దీంతో అసలు పంచాయతీ పోరు కంటే వీరిద్దరి పోరే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.

బాత్‌ టబ్‌లో యువ హీరోయిన్ ప్రియా బెనర్జీ హాట్ ఫోటోషూట్..

 సత్తా చూపుతున్న నిమ్మగడ్డ

సత్తా చూపుతున్న నిమ్మగడ్డ


ప్రభుత్వం నుంచి తీవ్ర సహాయ నిరాకరణ ఎదురవుతున్నా, కోరిన సిబ్బంది ఇవ్వకపోయినా, తన ఆదేశాలు లెక్కచేయకపోయినా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం తన పని చేసుకుపోతున్నారు. మరోవైపు హైకోర్టులో కోర్టు ధిక్కారం కేసు వేసి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే హైకోర్టు తర్వాతి విచారణ ఉన్న ఫిబ్రవరి 15 నాటికి సగం ఎన్నికలు పూర్తయిపోతాయి కూడా. దీంతో ఆ లోపు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలైన అన్ని దారులనూ నిమ్మగడ్డ అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం తన వద్ద నున్న సిబ్బందిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త సిబ్బంది కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

రంగంలోకి ఇతర రాష్ట్రాల ఎస్ఈసీలు

రంగంలోకి ఇతర రాష్ట్రాల ఎస్ఈసీలు

ఏపీలో తాను కోరుకున్న అధికారులను ప్రభుత్వం కేటాయిస్తుందో లేదో అన్న అనుమానాల మధ్య ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తనకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్ఈసీలు, మాజీ ఎస్ఈసీలను రంగంలోకి దింపాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వారి అనుభవాన్ని సేవలను వాడుకోవడం ద్వారా పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏపీ పంచాయతీ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది.

ప్రత్యేక పరిశీలకులుగా రావాలని ఆహ్వానం

ప్రత్యేక పరిశీలకులుగా రావాలని ఆహ్వానం

గతంలో తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన వి. నాగిరెడ్డితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఈసీలు, మాజీ ఎస్‌సీలను ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సేవలు అందించాలని నిమ్మగడ్డ రమేష్‌ ఆహ్వానం పంపారు. గతేడాది నవంబర్ 6న జరిగిన రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్‌ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వీరికి ఆహ్వానం పంపుతున్నట్లు నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఇలా ఇతర రాష్ట్రాల ఎస్‌ఈసీల సేవలు ప్రస్తుత ఎన్నికల్లో వాడుకునే విధానం ఢిల్లీ, చంఢీఘడ్‌, మహారాష్ట్ర, మిజోరం, మధ్యప్రదేశ్‌, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో అమల్లో ఉందని నిమ్మగడ్డ తెలిపారు.

 మాజీ ఎస్‌ఈసీలతో కౌంటర్ వ్యూహం

మాజీ ఎస్‌ఈసీలతో కౌంటర్ వ్యూహం


గతంలో పలు ప్రభుత్వ పదవుల్లో, రాజ్యాంగ సంస్ధల్లో, ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కలిగిన ఎస్ఈసీలను ఏపీకి రప్పించడం ద్వారా ప్రభుత్వాలతో ఎలా పనిచేయించుకోవాలన్న దానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ దృష్టిపెట్టే అవకాశముంది. వారి అనుభవాన్ని వాడుకోవడం ద్వారా పంచాయతీ పోరులో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు కౌంటర్‌ వ్యూహాన్ని అమలు చేసేందుకు నిమ్మగడ్డ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా నాగిరెడ్డిని రంగంలోకి దింపడం ద్వారా వైసీపీ సర్కారు తనపై వేస్తున్న కులముద్ర నుంచి బయటపడేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారా అన్న వాదన వినిపిస్తోంది. ఇదే కోవలో మరికొందరు అధికారులను ఆయన వ్యూహాత్మకంగా పరిశీలకుల రూపంలో రంగంలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు సర్కారు నుంచి విమర్శలకు దిగితే అధికారులతోనే కౌంటర్‌ ఇప్పించేందుకూ వీలు కలుగుతుంది.

Recommended Video

Atchannaidu Arrest : కింజ‌రపు కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు : ఎంపీ Rammohan Naidu

English summary
andhra pradesh state election commisioner nimmagadda ramesh kumar has invited other state election commissioners and former secs' to the state as election observers for ongoing panchayat polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X